TPT: తిరుమలలో రీల్స్ చేసిన యూట్యూబర్ గీతూ రాయల్ అండ్ టీమ్‌పై TTD ఆగ్రహం వ్యక్తం చేసింది. స్వప్రయోజనాల కోసం కొండపై అసత్య కథనాలతో రీల్స్ చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కాగా ఇవాళ ఘాట్ రోడ్డుతో పాటు ఆలయం ఎదుట, పుష్కరిణి సమీపంలో, కౌంటర్ల వద్ద గీతూ రాయల్ అండ్ టీం రీల్స్ చిత్రీకరించి SMలో పోస్ట్ చేశారు.
ELR: లాభాపేక్ష లేకుండా సమాజానికి సేవ చేస్తున్న రెడ్ క్రాస్ సొసైటీకి అందరూ అండగా నివాల్సిన అవసరం ఉందని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అన్నారు. ఏలూరు రెడ్ క్రాస్ సంస్థ భవనంలో 2వ అంతస్తు నిర్మాణ పనులకు ఎంపీ శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా తన తల్లి విజయలక్షి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రెడ్ క్రాస్ సంస్థకు ఎంపీ రూ. 2 లక్షల విరాళం అందించారు.
TPT: నారాయణవనం మండలం సింగిరి కోన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి సరస వెంకటనారాయణబట్టి దర్శించుకున్నారు. దర్శనార్థం ఆలయంలో ఏర్పాటుచేసిన సుదర్శన ధన్వంతరి హోమంలో పాల్గొన్నారు. అనంతరం ఆలయ పరిసరాలు, స్వామి అమ్మవార్ల దర్శన భాగ్యం చాలా సంతోషాన్ని కలిగించిందని ఆయన పేర్కొన్నారు.
ప్రకాశం: స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం కనిగిరి సెంట్ జెఎక్స్ స్కూల్లో విద్యార్థులకు ‘ముస్తాబు’ కార్యక్రమంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పట్టణాన్ని పరిశుభ్రంగా, అందంగా ఉంచడం ప్రతి పౌరుడి బాధ్యత అని మున్సిపల్ ఛైర్మన్ అబ్దుల్ కఫార్ తెలిపారు. చెత్తను వేరు చేయడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడంపై అవగాహన కల్పించారు.
ATP: బాణాసంచా పేలుడు ఘటనలో మరణించిన వారికి నివాళులర్పిస్తూ, ఈ ప్రమాదం ప్రభుత్వ వైఫల్యమని రిజర్వేషన్ల పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు పోతుల నాగరాజు విమర్శించారు. అనంతపురంలో ఆయన మాట్లాడుతూ.. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.కోటి పరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. బాణాసంచా తయారీ కేంద్రాలను తక్షణమే మూసివేయాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు.
VZM: కాకినాడ జిల్లా వేట్లపాలెం లో బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించి సుమారు 20 మంది సజీవ దహనం ఆయన సంగతి తెలిసిందే. సీఎం చంద్రబాబు ఆదేశాలతో విజయనగరం జిల్లా చీపురుపల్లి పర్యటనలో ఉన్న హోంమంత్రి అనిత హుటాహుటిన ఘటనా స్థలానికి పయనమయ్యారు. ఇప్పటికే అక్కడ అధికారులతో మాట్లాడి ఘటనపై ఆరా తీశారు.
NDL: బనగానపల్లె పట్టణంలో ఇవాళ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిరా రెడ్డి పర్యటించారు. మండల టైలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ టైలర్స్ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో ముఖ్య అతిథిగా బీసీ ఇందిరా రెడ్డి పాల్గొన్నారు. బనగానపల్లె మండలంలోని టైలర్లకు తమ వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని ఆమె అన్నారు.
PPM: పార్వతీపురంలో జీఎస్టీ నిధులతో పింక్ టాయిలెట్ నిర్మాణానికి ఏపీ జిఎస్టి కమిషనర్ పి. ఆనంద్ కుమార్, ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర శనివారం శంకుస్థాపన చేశారు. స్థానిక నాయకులు అధికారులతో కలిసి శిలాఫలకాన్ని ఆవిష్కరించి శంకుస్థాపన చేశారు. జీఎస్టీ కమిషనర్‌గా దేశవ్యాప్తంగా సేవలందించిన ఆనందకుమార్ రాష్ట్రానికి అనేక పథకాలు తీసుకొచ్చారని ఎమ్మెల్యే తెలిపారు.
SKLM: జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు ను వేగవంతం చేయాలి అని జిల్లా జనసేన పార్లమెంటరీ సమన్వయకర్త కె .రవికుమార్ అన్నారు. శనివారం నరసన్నపేటలో జరిగిన జనసేన క్రియాశీలక నమోదు ప్రక్రియలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి కార్యకర్త ప్రజలతో మమేకమై జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని గ్రామస్థాయి లో విస్తరించాలని కోరారు.
విశాఖ జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ రెడ్డి సతీష్ కుమార్ శనివారం జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా గ్రంథాలయ కార్యాలయాలు ప్రస్తుతం అద్దె భవనాల్లో కొనసాగుతున్న నేపథ్యంలో శాశ్వత భవనాలు కేటాయించాలని ఆయన కలెక్టర్‌ను కోరారు. అలాగే జీవీఎంసీ చెల్లించాల్సిన రూ.200 కోట్లకు పైగా లైబ్రరీ సెస్ బకాయిలను విడుదల చేయాలని కోరారు.
NLR: కావలి పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆదేశాల మేరకు మరమ్మతులకు గురైన చేతిపంపు బోర్లుకు అధికారులు మరమ్మతులు చేపట్టారు. శనివారం కాలనీలో ఉన్న మూడు బోర్లను అధికారులు గుర్తించి రిపేరు చేశారు. వేసవికాలం తాగునీటి ఎద్దడి తలెత్తుకుండా ఉండేందుకు ముందస్తుగా ఈ బోర్లు రిపేరు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
AKP: జీవీఎంసీ అనకాపల్లి జోన్ 82వ వార్డు పరిధిలో మంజూరైన పనులను వెంటనే ప్రారంభించాలని కార్పొరేటర్ ఎం సునీత విజ్ఞప్తి చేశారు. విశాఖ జీవీఎంసీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన విస్తృతస్థాయి సమావేశంలో ఆమె మాట్లాడారు. దోమలు విజృంభిస్తున్న నేపథ్యంలో ఇటీవల తొలగించిన మలేరియా సిబ్బందిని తిరిగి నియమించాలన్నారు. స్మశాన వాటికలో చేపట్టిన పనులను పూర్తి చేయాలన్నారు.
GNTR: పెదకాకాని మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద పొన్నూరు నియోజకవర్గ శాసనసభ్యులు, సంగం డెయిరీ ఛైర్మన్ ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ ఆదేశాల మేరకు నూతనంగా మంజూరైన 14 స్పౌజ్ (విడో) పెన్షన్లను పంపిణీ చేశారు. పెదకాకాని, తక్కెళ్ళపాడు, ఉప్పలపాడు, కొప్పురావూరు, వెనిగండ్ల గ్రామాల లబ్ధిదారులకు మండల ఎంపీపీతో పాటు, కూటమి నాయకులు పెన్షన్లు అందజేశారు.
ప్రకాశం: బేస్తవారిపేట మండలంలోని గలిజేరుగుళ్ల గ్రామంలో శనివారం కందులు, శనగల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి అబ్దుల్ రఫీక్ పాల్గొని మాట్లాడారు. కందులు ప్రభుత్వం మద్దతు ధర రూ. 8000, శనగలు ప్రభుత్వం మద్దతు ధర రూ. 5850గా నిర్ణయించడం జరిగిందని అన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలన్నారు.
KDP: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల బుక్‌లెట్‌ను టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో ఎం. రవిచంద్ర కలిసి ఆవిష్కరించారు. మార్చి 27 నుంచి ఏప్రిల్ 5 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 1న సీతారాముల కల్యాణాన్ని రాష్ట్ర పండుగగా అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.