»Sanctions From Iran May End Soon Crude Oil Prices Will Come Down India Will Benefit
Iran: గుడ్ న్యూస్.. త్వరలో ముడి చమురు ధరల్లో భారీ తగ్గుదల
అంతర్జాతీయ మార్కెట్లో త్వరలో ముడి చమురు(crude oil) ధరలో భారీ తగ్గుదల కనిపించవచ్చు. ప్రస్తుతం అమెరికా(America) ఆంక్షల కింద ఉన్న ఒపెక్(OPEC)కు ఇరాన్(Iran) తిరిగి రావడమే దీనికి ప్రధాన కారణమని భావిస్తున్నారు. ముడి చమురు ఉత్పత్తి సంస్థ ఒపెక్ సెక్రటరీ జనరల్ హైథమ్ అల్ ఘైస్ ఇరాన్ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది.
Iran: అంతర్జాతీయ మార్కెట్లో త్వరలో ముడి చమురు(crude oil) ధరలో భారీ తగ్గుదల కనిపించవచ్చు. ప్రస్తుతం అమెరికా(America) ఆంక్షల కింద ఉన్న ఒపెక్(OPEC)కు ఇరాన్(Iran) తిరిగి రావడమే దీనికి ప్రధాన కారణమని భావిస్తున్నారు. ముడి చమురు ఉత్పత్తి సంస్థ ఒపెక్ సెక్రటరీ జనరల్ హైథమ్ అల్ ఘైస్ ఇరాన్ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. త్వరలో ఇరాన్‌పై ఆంక్షలు ఎత్తివేయవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీని ప్రభావం ముడి చమురు ధరలో కనిపిస్తుంది. దాని ప్రయోజనాలు భారతదేశంలో కూడా కనిపిస్తాయి.
ఒపెక్ సూచన
ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత ఇరాన్ చమురు మార్కెట్(Oil market)లోకి తిరిగి రావడాన్ని సంస్థ స్వాగతిస్తున్నట్లు ఒపెక్ సెక్రటరీ జనరల్ హైథమ్ అల్ ఘైస్(OPEC Secretary General Haitham Al Ghais) సోమవారం తెలిపారు. టెహ్రాన్ అణు కార్యక్రమాన్ని ఆపడానికి అమెరికా చమురు ఎగుమతులను నిషేధించినప్పటికీ, ఇరాన్ ఒపెక్ సభ్యదేశంగా ఉంది. తొలిసారి టెహ్రాన్(Tehran)ను సందర్శించిన అల్ ఘైస్, తక్కువ సమయంలో పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఇరాన్‌కు ఉందని చెప్పారు. ఇరాన్ ఒపెక్ కుటుంబంలో సభ్యదేశమని, చమురు మార్కెట్లో కూడా బాధ్యతాయుతమైన దేశమని ఆయన అన్నారు.
ఉత్పత్తిలో కోత ఎంత
ఒపెక్ స్వచ్ఛంద ఉత్పత్తి కోత, చమురు ధరలపై దాని ప్రభావం గురించి అడిగినప్పుడు, ఒపెక్‌లో వారు నిర్దిష్ట ధర స్థాయిలను లక్ష్యంగా చేసుకోరని ఘైస్ చెప్పారు. ఇది ప్రపంచ చమురు డిమాండ్, సరఫరాపై నిర్ణయించబడుతుంది. ఏప్రిల్ ప్రారంభంలో OPEC ప్లస్ రోజుకు 1.2 మిలియన్ బ్యారెళ్ల చమురు ఉత్పత్తిని తగ్గించినట్లు ప్రకటించింది. ఆ తర్వాత ఒపెక్ ప్లస్ మొత్తం చమురు ఉత్పత్తి కోత రోజుకు 3.66 మిలియన్ బ్యారెళ్లకు పెరిగింది.
చౌకగా క్రూడ్ ఆయిల్
చమురు మార్కెట్లో ఇరాన్ నిలిస్తే మార్కెట్‌పై చాలా ప్రభావం ఉంటుంది. ఇరాన్ చమురు మార్కెట్లోకి వస్తే క్రూడాయిల్ ధరలు తగ్గి సామాన్యులకు ఊరట లభించనుంది. ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్ కు 77 డాలర్ల దిగువకు పడిపోయింది. మరోవైపు, WTI ధర బ్యారెల్‌కు 72.43డాలర్ల వద్ద ఉంది. ఏడాదిన్నర క్రితం ముడి చమురు ధర బ్యారెల్‌కు 130 డాలర్లు దాటింది. దానికి కారణం రష్యా ఉక్రెయిన్ యుద్ధం.
భారతదేశం ఎలా లాభపడుతుంది
ఇరాన్ మళ్లీ చమురు మార్కెట్‌కు తిరిగి వస్తే, ముడి చమురు ధర బ్యారెల్‌కు 70 డాలర్ల దిగువకు తగ్గుతుందని అంచనా. ఇది భారతదేశానికి ప్రయోజనం చేకూరుస్తుంది. దేశంపై దిగుమతి సుంకం తక్కువగా ఉంటుంది. పెట్రోల్ , డీజిల్ ధరలను తగ్గించడంలో సహాయపడుతుంది. భారతదేశంలో ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంలో చాలా సహాయపడుతుంది. IIFL వైస్ ప్రెసిడెంట్ అనూజ్ గుప్తా ప్రకారం, ఇరాన్ నుండి ఆంక్షలను ఎత్తివేయడం వల్ల భారతదేశానికి పెద్ద ప్రయోజనం ఉంటుందన్నారు. రెండు దేశాల మధ్య చాలా మంచి సంబంధాలు కూడా ఉన్నాయి. దిగుమతులలో కూడా చాలా సౌలభ్యం ఉంటుంది.