2023 లాగానే ఈ ఏడాది కూడా భారత స్టాక్ మార్కెట్ పెరుగుదల కొనసాగుతోంది. పెట్టుబడిదారులు వేగంగా డబ్బును సంపాదిస్తున్నారు. దీంతో మార్కెట్ కూడా లాభపడుతోంది. ఈరోజు నిఫ్టీ 50 ఆల్ టైమ్ హై ఫిగర్‌ను తాకింది.
2023 సంవత్సరం భారత ఆర్థిక వ్యవస్థతో పాటు బ్యాంకింగ్ వ్యవస్థకు అద్భుతమైనది నిరుపితమైంది. బ్యాంకింగ్ వ్యవస్థలో డిపాజిట్ చేసిన మొత్తం రెండింతలు పెరిగింది.
భారతదేశాన్ని ప్రపంచ ఫార్మసీ అంటారు. చౌక ఔషధాలను తయారు చేయడంలో భారతదేశానికి సాటి ఎవరూ లేరు, అయితే రాబోయే రోజుల్లో ఈ నిజం మారవచ్చు. త్వరలోనే దేశంలో ప్రజల చికిత్స ఖర్చు పెరగవచ్చు.
అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ జనవరి 13 మధ్యాహ్నం నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో మొబైల్స్, ఫోన్ యాక్సెసరీలు, స్మార్ట్‌వాచ్, ల్యాప్‌టాప్‌లు, టీవీలతో పాటు ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై డిస్కౌంట్ ఇవ్వనుంది.
రామాలయ ప్రారంభోత్సవానికి సన్నాహాలు ముమ్మరం అవుతున్నాయి. రామ మందిరం పట్ల ప్రజల్లో విపరీతమైన ఉత్సాహం ఉంది. రాముడి ప్రతిష్టాపనకు ముందు విమాన ఛార్జీల ధరలు ఆకాశాన్నంటాయి.
ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఉద్యోగాలను తొలగిస్తోంది. ఈ రిట్రెంచ్ మెంట్ తర్వాత కంపెనీలో ఉద్యోగుల పరిమాణం 7శాతం వరకు తగ్గనుంది. ఈ కోత వార్షిక పనితీరు సమీక్షపై ఆధారపడి ఉంటుంది.
ప్రముఖ ఎలక్ట్రానిక్ చిప్‌ల తయారీ సంస్థ క్వాల్‌కామ్ భారత్‌లో రూ. 177 కోట్ల పెట్టుబడులు పెడుతున్న ప్రకటించింది.
మార్కెట్లోకి కొత్తగా ఏథర్ 450 అపెక్స్ నుంచి స్కూటర్ లాంఛ్ అయ్యింది. మరి ఈ స్కూటర్ ధర, ప్రత్యేకతలేంటో తెలుసుకుందాం.
ఇప్పుడు నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (ఎన్‌సిఆర్‌టిసి)కి చెందిన నమో భారత్ రైలులో ప్రకటనలు, సినిమాల షూటింగ్ కూడా జరుపుకోవచ్చు. ఇందుకోసం స్టేషన్, రైలును పూర్తిగా సిద్ధం చేస్తున్నారు.
రాబర్ట్ కియోసాకి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పరిచయం అక్కర్లేని రచయిత. అతని పుస్తకం 'రిచ్ డాడ్, పూర్ డాడ్' చాలా ప్రజాదరణ పొందింది. ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడైన అతడి పుస్తకం తరచుగా వ్యక్తిగత ఫైనాన్స్‌పై సలహాలను పంచుకుంటారు.
2024 సంవత్సరం ప్రారంభమే గౌతమ్ అదానీకి మంచి శుభారంభాన్ని అందించింది. ఒకవైపు సుప్రీంకోర్టు తీర్పుతో అదానీ గ్రూప్‌కు పెద్ద ఊరట లభించింది. గౌతమ్ అదానీ వ్యక్తిగత నికర విలువ కూడా వేగంగా పెరుగుతోంది.
ఫోన్‌పే ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తుంది. ఈక్రమంలో తాజాగా క్రెడిట్ అనే కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో క్రెడిట్ స్కోర్‌తో పాటు, క్రెడిట్ హిస్టరీని కూడా ఉచితంగా తెలుసుకోవచ్చు.
నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియాకు కేంద్ర ప్రభుత్వం పెద్ద బాధ్యతను అప్పగించింది. 16వ ఆర్థిక సంఘం చైర్మన్‌గా పనగారియాను కేంద్ర ప్రభుత్వం ఆదివారం నియమించింది.
ఓ వ్యక్తి బ్లింకిట్ లో ఈ ఏడాదంతా కలిసి 9,940 కండోమ్స్ ఆర్డర్ పెడితే మరో వ్యక్తి 38 అండర్ వేర్లను ఒకే నెలలో ఆర్డర్ చేసుకున్నాడు. ఇలాంటి మరికొన్ని ఆర్డర్ల గురించి బ్లింకిట్ తెలియజేసింది.
ఇన్ని రోజులుగా పేద, మధ్యతరగతి కుటుంబాలకు అదనపు భారంగా మారిన పెట్రోల్, డీజిల్ రేట్లను తగ్గించేందుకు ఎట్టకేలకు ప్రధాని నరేంద్ర మోడీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. లీటర్ పెట్రోల్‌పై 10 రూపాయలు, లీటర్ డీజిల్‌పై 8 రూపాయల తగ్గింపునకు ప్రధాని నరేంద్ర మోడీ ఆమోదం తెలపనున్నారు.