బంగారం వ్యాపారంలో లలితా జ్యువెలర్స్ ధోరణి భిన్నం. ప్రజలను ఆకర్షించడంలో లలితా జ్యువెలర్స్ ఎండీ కిరణ్ కుమార్ ప్రత్యేకత చాటుతున్నారు. ‘డబ్బులు ఊరికే రావు’ అనే డైలాగ్ తో తెలుగు రాష్ట్రాల్లో సంచలనాలకు మారుపేరైన కిరణ్ కుమార్ వ్యాపారం విజయవంతంగా సాగుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో పాటు దేశంలో ఇతర ప్రాంతాల్లో తన స్టోర్లను పెంచుకుంటూ తన వ్యాపారాన్ని విస్తరిస్తున్నాడు. అయితే తన విజయం వెనుక ఒకరు ఉన్నారని ...
తెలంగాణకు పెట్టుబడుల వరద కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఆర్థిక విధానాలు పారిశ్రామికవేత్తలను, అగ్రశ్రేణి సంస్థలను ఆకర్షిస్తున్నాయి. దావోస్ వేదికగా పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతుండగా.. ప్రముఖ అంతర్జాతీయ ఈ- కామర్స్ దిగ్గజం అమెజాన్ భారీ పెట్టుబడిని ప్రకటించింది. 2030 నాటికి ఏకంగా రూ.36, 300 కోట్ల పెట్టుబడులు చేయనున్నట్లు వెల్లడించింది. అమెజాన్ వెబ్ సర్వీసెస్ సెంటర్ ఈ పెట్టుబడులు పెట్టనున్...
ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ సంస్థలు భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తూ ఖర్చులు తగ్గించుకునే పనిలో పడ్డాయి. టెక్ దిగ్గజం గూగుల్ కూడా అదే బాటలో నడుస్తోంది. గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ 6 శాతం మంది ఉద్యోగులపై వేటుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ నిర్ణయంతో 12 వేల మంది ఉద్యోగాలు కోల్పోనున్నట్టు తెలుస్తోంది. గూగుల్ గత కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ప్రతిభావంతులను ఆకర్షిస్తూ క్రోమ్ సెర్చ్ ఇంజిన్, యూట్యూబ్, ఇతర వేద...
బీఎండబ్ల్యూలో సరికొత్త కారు అందుబాటులోకి రానుంది. జర్మనీ కార్ల తయారీ దిగ్గజం బీఎండబ్ల్యూ ఓ సరికొత్త మోడల్ ను ఆవిష్కరించింది. ఆయా పరిస్థితులను బట్టీ 240 రంగులను ఆ కారు మార్చనుంది. ఈ కారును చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. Dee comes full colour 🔴⚪️🟡🟢🔵Introducing the BMW i Vision Dee with full-colour E Ink technology. The tech allows for a vibrant, individually configurable exterior with up to [&hell...
విశ్వనగరం దిశగా హైదరాబాద్ వడివడిగా అడుగులు వేస్తోంది. ప్రపంచంలోని దిగ్గజ సంస్థలు హైదరాబాద్ లో కొలువుదీరుతున్నాయి. డేటా కేంద్రాలకు అడ్డాగా.. దేశంలోనే ఐటీకి ప్రధాన నగరంగా.. లైఫ్ సైన్సైస్, టీకాలకు కేంద్రంగా మారిన హైదరాబాద్ దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతోంది. దావోస్ వేదికగా తెలంగాణకు పెట్టుబడులు వెల్లువగా వస్తుండగా.. ప్రముఖ సంస్థలన్నీ హైదరాబాద్ లో కార్యకలాపాలు మొదలుపెడుతున్నాయి. ఇప్పటికే ప్రఖ్యాత సంస్...
ప్రపంచవ్యాప్తంగా ప్రైవేటు కంపెనీలు ఉద్యోగాల కోతపై ఫోకస్ పెట్టాయి. ప్రస్తుతం అంతర్జాతీయంగా ఒక విధమైన భయాందోళన వాతావరణం కమ్ముకుంది. దీంతో దిగ్గజ సంస్థలతో పాటు స్టార్టప్ కంపెనీలు కూడా ఉద్యోగులను ఇంటి బాట పట్టిస్తున్నాయి. ఇటీవల మైక్రోసాఫ్ట్, అమెజాన్, ట్విటర్, షేర్ చాట్ వంటి సంస్థలు తమ ఉద్యోగులకు లేఆఫ్ ప్రకటించగా.. తాజాగా ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ కూడా ఉద్యోగులను సాగనంపింది. దాదాపు 400 మంది ఉద్యోగు...
అపర కుబేరుడు.. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. అతడి కుమారుడు అనంత్ అంబానీ నిశ్చితార్థ వేడుక రాధికా మర్చంట్ తో గురువారం అంగరంగ వైభవంగా జరిగింది. భారీ ఖర్చుతో ప్రపంచంలో దొరికే అత్యంత అరుదైన పూలతో సుందరంగా ముంబైలోని అతడి నివాసాన్ని అలంకరించారు. గుజరాతీ సంప్రదాయం ప్రకారం నిశ్చితార్థ వేడుక నిర్వహించారు. ముంబైలోని నివాసంలో సంప్రదాయబద్ధంగా జరిగ...
స్టాక్ మార్కెట్లు మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. రెండు రోజుల పాటు లాభాలతో కొనసాగుతోన్న స్టాక్ మార్కెట్లకు నేడు బ్రేక్ పడినట్లయ్యింది. గురువారం ఉదయం నుంచి నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు సాయంత్రం వరకూ కూడా అదే హవాను కొనసాగించాయి. నేడు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 187 పాయింట్లు, నిఫ్టీ 57 పాయింట్లు నష్టపోయింది. టాటా స్టీల్ 0.73%, పవర్ గ్రిడ్ 0.64%, టెక్ మహీంద్రా 0.49%, యాక్సిస్ బ్య...
బడ్జెట్ సమావేశాలకు సమయం సమీపిస్తోంది. వచ్చే సంవత్సరం సార్వత్రిక ఎన్నికలు ఉండడంతో ఈ ఏడాది (2023) ప్రవేశపెట్టేది పూర్తిస్థాయి బడ్జెట్. ఎన్నికల నేపథ్యంలో కేంద్రం తమపై కరుణ చూపిస్తుందని సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఆశిస్తున్నారు. కేంద్ర బడ్జెట్ మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. కిల్లీ కొట్టు నుంచి స్టాక్ మార్కెట్ దాకా కేంద్ర బడ్జెట్ పై ఎన్నో ఆశలు పెంచుకుని ఉంటాయి. అయితే బీజేపీ సారథ్యంల...
ఐటీ ఉద్యోగ కల్పనలో బెంగళూరును తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ దాటి వేసిందని మంత్రి కేటీ రామారావు అన్నారు. అయితే ఇక్కడ బెంగళూరును తక్కువ చేసి చూపించాలనేది తన ఉద్దేశ్యం కాదని, తాము అధికారంలోకి వచ్చాక అన్నింటా అభివృద్ధి దూసుకు వెళ్తోందన్నారు. దేశవ్యాప్తంగా ఐటీ రంగంలో 5 మిలియన్ ఉద్యోగాలు ఉంటే, ఇందులో 1 మిలియన్ ఉద్యోగాలు కేవలం హైదరాబాద్, తెలంగాణ నుండే ఉన్నాయన్నారు. అంటే 20 శాతం హైదరాబాద్ నుండి ఉంద...
ఎండు మిర్చి బంగారంతో పోటీ పడటం కాదు.. బంగారాన్ని మించి ఒకటిన్నర రెట్లు పలికింది! మార్కెట్‌లో ఎండు మిర్చికి మంచి డిమాండ్ కనిపిస్తోంది. దిగుమతి తగ్గడం, పచ్చళ్ల సీజన్ సమీపిస్తుండటంతో ఎండు మిర్చి రికార్డు ధర పలుకుతోంది. శుక్రవారం ఎనుమాముల మార్కెట్‌లో ఎండు మిర్చి ధర క్వింటాల్‌కు ఏకంగా రూ.80,100 పలికింది. అయితే అన్ని రకాల మిర్చికి ఈ ధర రాలేదు. పచ్చళ్లు, ఔషదాలలో వినియోగించే ఓ రకమైన మిర్చి ఆసియా అతిపెద...
ప్రపంచంతో పాటు భారత స్టాక్ మార్కెట్‌లో కరోనా భయాలు కమ్ముకున్నాయి. ఈ నెలలోనే 63,000 మార్కు పైకి చేరుకున్న సెన్సెక్స్ ఆ తర్వాత అంతర్జాతీయ పరిణామాలతో నష్టపోయాయి. ఆ తర్వాత కాస్త పుంజుకున్నట్లు కనిపించినప్పటికీ, చైనాలో కోవిడ్ బీఎఫ్ 7 వేరియంట్ ఆందోళనలు ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. నెల రోజుల క్రితం చైనాలో కరోనా ఆంక్షలు ఎత్తివేయడంతో రోజుకు వేలు, లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. జపాన్, అమెరికాలోను కేసులు...
బ్యాంకులు గత ఐదు ఆర్థిక సంవత్సరాలలో రూ.10 లక్షల కోట్ల మొండి బకాయిలను (NPA) రైటాఫ్ చేసినట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ రాజ్యసభలో తెలిపారు. ఇందులో గత నాలుగు ఆర్థిక సంవత్సరాలలోనే రూ.8.5 లక్షల కోట్ల రుణాలను రైటాఫ్ చేసినట్లు తెలిపారు. అలాగే, ఇదే కాలంలో పబ్లిక్ రంగ బ్యాంకులకు చెందిన ఒక లక్ష మూడువేల కోట్ల రైటాఫ్ లోన్లను రికవరీ చేసినట్లు తెలిపారు. నాలుగేళ్లు దాటిన మొండి బకాయిలను బ్యాంకులు ర...
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం (డిసెంబర్ 8) స్వల్ప లాభాల్లో ప్రారంభమై, దాదాపు అదే స్థాయిలో కొనసాగుతున్నాయి. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఉండటంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉన్నారు. ఈ ఫలితాలు బీజేపీకి అనుకూలంగా వచ్చాయి. అయినప్పటికీ కాస్త ఫ్లాట్‌గానే కనిపిస్తోంది మార్కెట్. మొత్తానికి స్వల్ప లాభాల్లో ఉంది. మధ్యాహ్నం గం.11.40 సమయానికి సెన్సెక్స్ 60 పాయింట్లు లాభపడి, 62,469 పాయి...
కేంద్ర బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) రెపో రేటును పెంచింది. రెపో రేటు అంటే బ్యాంకులకు ఆర్బీఐ ఇచ్చే వడ్డీ రేటు. ఈ రెపో రేటు పెరిగితే, బ్యాంకులు తన కస్టమర్లకు ఇచ్చే రుణాలపై వడ్డీ రేటు పెరుగుతుంది. మూడు రోజుల పాటు జరిగిన ఆర్బీఐ ద్వైపాక్షిక భేటీలో తీసుకున్న నిర్ణయాలను గవర్నర్ శక్తికాంతదాస్ బుధవారం మీడియాకు వివరించారు. రెపో రేటును 0.35 పాయింట్లు శాతం లేదా 35 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు ...