hyderabad and visakhapatnam delhi gold rates on december 13th 2023
Gold and Silver Rates Today : పసిడిని పెట్టుబడి మార్గంగా తీసుకునే వారు, ఇష్టపడి కొనుక్కోవాలని చూసేవారు వారు రోజువారీ పసిడి రేట్లను తెలుసుకుంటూ ఉండటం అత్యావస్యకం. మరి ఇవాల్టి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి ఇది చదివేయండి. దేశీయ మార్కెట్లో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.281 పెరిగింది. దీంతో నేడు దీని ధర రూ.73,500గా నమోదైంది.
చదవండి : నటుడు సాయిధరమ్ తేజ్ రోడ్ షోలో రాళ్ల దాడి!
విశాఖపట్నం, ప్రొద్దుటూరు, హైదరాబాద్, విజయవాడ తదితర ప్రధాన పట్టణాల్లోనూ పది గ్రాముల పసిడి ధర(Gold Rate) రూ.73,500గా కొనసాగుతోంది. ఈ ధరలు మార్కెట్ ప్రారంభ సమయంలో ఉన్నవని గుర్తుంచుకోవాలి. కొనుగోలుదారులు నగల్ని కొనుగోలు చేస్తున్నప్పుడు మజూరీ, జీఎస్టీల్లాంటివి అదనంగా తోడవుతాయని గమనించుకోవాలి.
చదవండి : మంత్రి పీఏ.. పని మనిషి ఇంట్లో కోట్ల నోట్ల కట్టలు సీజ్!
ఇక దేశీయ మార్కెట్లలో కిలో వెండి ధర(Silver Rate) సైతం సోమవారం చెప్పుకోదగ్గ రీతిలో పెరిగింది. రూ.852 పెరిగి రూ.82,364కి చేరుకుంది. విశాఖపట్నం, ప్రొద్దుటూరు, హైదరాబాద్, విజయవాడ,ల్లోనూ దాదాపు ఇదే ధరలు కొనసాగుతున్నాయి. వెండి, బంగారం రెండూ కూడా నేటి మార్కెట్ ప్రారంభ సమయానికి పెరగడం గమనార్హం.
ఇక అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్, వెండి ధరలు సైతం పెరిగాయి. సోమవారం పది డాలర్లు పెరిగి 2312 డాలర్లకు చేరుకుంది. అలాగే ఔన్సు వెండి ధర ప్రస్తుతం 26.95 డాలర్లుగా ఉంది.

