»Ysrcp Attack On Janasena Campaign Saidharam Tej Roadshow
YSRCP Attack : నటుడు సాయిధరమ్ తేజ్ రోడ్ షోలో రాళ్ల దాడి!
జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో భాగంగా నటుడు సాయి ధరమ్ తేజ్ రోడ్‌షో నిర్వహించారు. ఆ సమయంలో వైసీపీ కార్యకర్తలు సాయిధరమ్ తేజ్‌ను లక్ష్యంగా చేసుకుని రాళ్ల దాడికి దిగారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
YSRCP Attack in Pithapuram : ఎన్నికల వేళ ఆంధ్ర ప్రదేశ్‌లో చెదురుమదురుగా హంసాత్మక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం(Pithapuram) నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి సినీ నటుడు సాయిధరమ్ తేజ్ రోడ్ షో(ROADSHOW) నిర్వహించారు. ఈ షోలో సాయి ధరమ్ తేజ్ లక్ష్యంగా కొందరు వైసీపీ కార్యకర్తలు రాళ్ల దాడికి దిగారు. తాటిపర్తిలో ఈ ఘటన జరిగింది.
ఇలా రాళ్లు విసరడంతో ఓ జనసేన కార్యకర్త గాయపడ్డాడు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిందితులను వెంటనే పట్టుకుని శిక్షించకపోతే తాము ఎస్పీ ఆఫీస్ దగ్గర ధర్నాకు దిగుతామని తెలుగుదేశం నేతలు వెల్లడించారు. ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా జనసేన, వైసీపీ కార్యకర్తల మధ్యలో వాగ్వాదాలు, తోపులాటలు జరిగాయి.
తొలుత సాయిధరమ్‌తేజ్(SAIDHARAM TEJ).. పవన్ కళ్యాణ్ తరఫున ప్రచారానికి వెళ్లారు. తాటిపర్తిలోని గజ్జాలమ్మ సెంటర్ దగ్గరకు చేరుకున్న జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అటుగా వెళుతున్న వైఎస్ఆర్సీపీ(YSRCP) కార్యకర్తలు కూడా పోటా పోటీగా నినాదాలు చేశారు. ఆ తర్వాత కాసేపటికి ఇలా రాళ్లదాడి జరిగింది. సాయిధరమ్ తేజ్ లక్ష్యంగా ఈ దాడి జరిగిందని స్థానిక తెలుగు దేశం నేత వర్మ అన్నారు. పోలీసులకు నిందితులు ఎవరో కచ్చితంగా తెలుసని వారిని పట్టుకోకపోతే ధర్నాకి దిగుతామని హెచ్చరించారు.