Gold and Silver Rates Today : ధరలు తగ్గినప్పుడు పసిడిని కొనుక్కోవాలనే ఆలోచనలో ఉన్న వారు రోజూ వీటి ధరలను చెక్ చేసుకోవడం తప్పనిసరి. మరి దేశీయ మార్కెట్లో మంగళవారం వెండి, బంగారం ధరలు చెప్పుకోదగ్గ రీతిలో పెరిగాయి. 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర నేడు రూ.500 పెరిగి రూ.74,000కు చేరుకుంది.
విజయవాడ, విశాఖపట్నం. హైదరాబాద్, ప్రొద్దుటూరు తదితర ప్రధాన పట్టణాల్లోనూ పది గ్రాముల పసిడి ధర(Gold Rate) రూ.74,000గా కొనసాగుతోంది. ఈ ధరలు మార్కెట్ ప్రారంభ సమయంలో ఉన్నవని గుర్తుంచుకోవాలి. కొనుగోలుదారులు నగల్ని కొనుగోలు చేస్తున్నప్పుడు జీఎస్టీ, మజూరీల్లాంటివి అదనంగా తోడవుతాయని గమనించుకోవాలి.
ఇక దేశీయ మార్కెట్లలో కిలో వెండి ధర(Silver Rate) సైతం మంగళవారం భారీగా పెరిగింది. ఈ ఒక్కరోజే ఏకంగా రూ.1,775 పెరిగి రూ.84,139కు చేరుకుంది. విశాఖపట్నం, ప్రొద్దుటూరు, హైదరాబాద్, విజయవాడ ల్లోనూ దాదాపు ఇదే ధరలు కొనసాగుతున్నాయి. వెండి, బంగారం రెండూ కూడా నేటి మార్కెట్ ప్రారంభ సమయానికి అప్‌ట్రెండ్‌లో ఉండటం గమనార్హం.
ఇక అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్, వెండి ధరలు సైతం పెరుగాయి. పసిడి ధర మంగళవారం 20 డాలర్లు పెరిగి.. 2322 డాలర్లకు చేరుకుంది. ఔన్సు వెండి ధర ప్రస్తుతం 27.34 డాలర్లుగా ఉంది.