»Icici Bank Earns 18308 Crore Just From Interest In Q2 Profit Rise More Than 10000 Cr
ICICI Bank: వడ్డీ ద్వారానే వేల కోట్లు సంపాదించిన ఐసీఐసీఐ బ్యాంక్
మీరు బ్యాంకు నుండి హోమ్ లోన్, కారు లోన్ తీసుకున్నప్పుడల్లా, సదరు బ్యాంకు మీ నుండి వడ్డీని వసూలు చేస్తుంది. అదేవిధంగా, మీరు క్రెడిట్ కార్డ్ చెల్లింపులో ఆలస్యం చేసినప్పుడు బ్యాంకు మీకు ఫైన్ వేస్తుంది.
ICICI Bank: మీరు బ్యాంకు నుండి హోమ్ లోన్, కారు లోన్ తీసుకున్నప్పుడల్లా, సదరు బ్యాంకు మీ నుండి వడ్డీని వసూలు చేస్తుంది. అదేవిధంగా, మీరు క్రెడిట్ కార్డ్ చెల్లింపులో ఆలస్యం చేసినప్పుడు బ్యాంకు మీకు ఫైన్ వేస్తుంది. అది కూడా వినియోగదారులు చెల్లించాలి. అయితే ఈ చిన్న వడ్డీల ద్వారా బ్యాంకులు వేల కోట్లు సంపాదిస్తున్నాయి. ఇప్పుడు దేశంలోని రెండవ అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ అయిన ICICI బ్యాంక్ కేవలం 3 నెలల్లో వడ్డీ ద్వారానే బ్యాంకు రూ.18,300 కోట్లు ఆర్జించింది.
ఐసీఐసీఐ బ్యాంక్ జూలై-సెప్టెంబర్ త్రైమాసిక ఆర్థిక నివేదికను శనివారం సమర్పించింది. ఇది నికర లాభం నుండి బ్యాంకు సంపాదించిన మొత్తం ఆదాయం వరకు సమాచారాన్ని కలిగి ఉంటుంది. ఈ 3 నెలల్లో వడ్డీ ద్వారానే నికర ఆదాయం 24 శాతం పెరిగిందని… అది రూ. 18,308 కోట్లు అని బ్యాంక్ తెలిపింది. జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో ఐసీఐసీఐ బ్యాంక్ నికర లాభం రూ.10,261 కోట్లు. గతేడాది ఇదే త్రైమాసికం లాభంతో పోలిస్తే ఇది 36 శాతం ఎక్కువ. ఈ కాలంలో బ్యాంక్ మొత్తం నిర్వహణ ఆదాయం 31 శాతం పెరిగి రూ.40,697 కోట్లకు చేరుకుంది.
RBI మార్గదర్శకాల ప్రకారం, బ్యాంకులు ప్రతి త్రైమాసికంలో బ్యాలెన్స్ షీట్లో తమ మొండి బకాయిల కోసం ప్రత్యేక నిధిని చూపాలి. ఇందుకోసం బ్యాంకు చేసిన కేటాయింపుల్లో ఈసారి గణనీయంగా తగ్గుదల కనిపించింది. ఎన్పీఏ కోసం బ్యాంకు కేటాయింపులు రూ.583 కోట్లకు తగ్గాయి. గతేడాది ఇదే త్రైమాసికంలో ఇది రూ.1,645 కోట్లు. 2023-24 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఇది రూ.1,292.4 కోట్లుగా ఉంది. బ్యాంక్ స్థూల NPA (మొండి బకాయిలు) దాని స్థూల రుణంలో 2.48 శాతంగా మారింది. బ్యాంకు నికర NPA నికర రుణంలో 0.43 శాతం మాత్రమే.