»Man Jailed For Physical Relation With Wife Know Matter
Viral news : భార్యతో పడుకున్న భర్త.. రెండేళ్లు జైలు శిక్ష విధించిన కోర్టు
అమెరికాలో ఓ ఆశ్చర్యకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ భార్యతో శారీరక సంబంధం పెట్టుకున్న వ్యక్తికి రెండేళ్ల జైలు శిక్ష పడింది. ఈ వ్యక్తి పేరు ట్రావిస్ ఫీల్డ్గ్రోవ్(40). కాగా అతని భార్య పేరు సమంతా కెర్ష్నర్(21).
Viral news : అమెరికాలో ఓ ఆశ్చర్యకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ భార్యతో శారీరక సంబంధం పెట్టుకున్న వ్యక్తికి రెండేళ్ల జైలు శిక్ష పడింది. ఈ వ్యక్తి పేరు ట్రావిస్ ఫీల్డ్గ్రోవ్(40). కాగా అతని భార్య పేరు సమంతా కెర్ష్నర్(21). ఈ జంట అక్టోబర్ 1న నెబ్రాస్కాలోని హేస్టింగ్స్లో వివాహం చేసుకున్నారు. తన సొంత భార్యతో లైంగిక సంబంధం పెట్టుకున్నందుకు ఎందుకు ఈ వ్యక్తికి ఎందుకు శిక్ష పడిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. వాస్తవానికి ఆయన పెళ్లి చేసుకున్న అమ్మాయి స్వయాన తన కూతురు. అవును మీరు సరిగ్గానే చదువుతున్నారు. సమంతా ఆ వ్యక్తికి భార్య, కుమార్తె. వారి మధ్య శారీరక సంబంధాలు రెండూ ఉన్నాయని వారిద్దరూ విచారణలో అంగీకరించారు. మూడేళ్ల క్రితం తన తల్లిని ఆమె.. తన తండ్రి ఎవరని అడిగింది. దీంతో ఆమె తన తండ్రి ఫీల్డ్గ్రోవ్ అని, అతడి అడ్రస్ చెప్పింది. దీంతో ఆమె తన తండ్రిని కలవాలనుకుంది.
ఫీల్డ్గ్రోవ్ గురించి తెలుసుకున్న సమంత తన తండ్రిని కలుసుకుని అతడితో 3 సంవత్సరాలు కుమార్తెలా జీవించింది. క్రమంగా వారి మధ్య సంబంధం మారడం ప్రారంభమైంది. అది కాస్త లైంగిక సంబంధాల స్థాయికి చేరుకుంది. తండ్రీకూతుళ్ల నుంచి భార్యాభర్తల మధ్య సంబంధం ఎలా సాగిందో వారిద్దరూ పోలీసులకు మాత్రం చెప్పలేదు. అయితే, ఇద్దరి మధ్య చాలా సాన్నిహిత్యం ఉందని అతడు అంగీకరించాడు. వీరిద్దరికి డీఎన్ఏ పరీక్ష నిర్వహించగా ఈ విషయం వెల్లడైంది. వీరిద్దరి మధ్య అసలు బంధం తండ్రీకూతుళ్లదేనన్న నిజం డీఎన్ఏ పరీక్షలో తేలింది. కానీ వారు పరిమితులను దాటి తండ్రీకూతుళ్ల బంధాన్ని విచ్ఛిన్నం చేశారు. ఫీల్డ్గ్రో, సమంతా ఇద్దరూ వ్యభిచారానికి పాల్పడ్డారని.. పవిత్రమైన తండ్రి-కుమార్తె సంబంధాన్ని అగౌరవపరిచారని కోర్టు సమక్షంలో అంగీకరించారు. ఇద్దరి వాదనలు విన్న న్యాయమూర్తి జెఫ్ లోఫ్లర్తో.. ఫీల్డ్గ్రోవ్ ఇకపై ఇలాంటివి చేయనని అన్నారు. ఫీల్డ్గ్రోవ్ తన కుమార్తెతో పడుకున్నందుకు 2 సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది.