Gold Rate Today : స్వల్పంగా పెరిగిన బంగారం, పెరిగిన వెండి ధరలు
పసిడిని కొనుక్కోవాలనే ఆలోచనలో ఉన్న వారు రోజువారీ రేట్లను తెలుసుకుంటూ ఉండటం అత్యావస్యకం. మరి ఇవాల్టి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలంటే ఇది చదివేయాల్సిందే.
Gold and Silver Rates : దేశీయ మార్కెట్లో పసిడి రేట్లు బుధవారం స్వల్పంగా పెరిగాయి. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర(Gold Rate) రూ.210 పెరిగి రూ.64,087కు చేరుకుంది. మంగళవారం ఈ ధర రూ.63,877గా ఉంది. అలాగే మంగళవారం రూ.72,810గా ఉన్న కిలో వెండి ధర(Silver Rate) రూ.264 పెరిగి రూ.73,074కు చేరుకుంది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం. హైదరాబాద్, విజయవాడ, విశాఖ పట్నం, ప్రొద్దుటూరుల్లో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ. 64,087గా కొనసాగుతోంది. అలాగే ఈ నాలుగు పట్టణాల్లోనూ కిలో వెండి ధర రూ.73,074గా ఉంది. ఈ ధరలన్నీ మార్కెట్ల ప్రారంభం అయ్యే సమయానికి ఉన్నవని గుర్తుంచుకోవాలి. అలాగే ఆభరణాలు కొనుగోలు చేయాలని అనుకుంటున్న వారు ఈ ధరలు అన్నింటికీ మజూరీలు, ట్యాక్సులు తోడవుతాయని గుర్తుంచుకోవాలి.
అలాగే అంతర్జాతీయ మార్కెట్లో స్టాక్ గోల్డ్ ధరలు సైతం భారీగా పెరిగాయి. మంగళవారం ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 2018 డాలర్లు ఉండగా, బుధవారం నాటికి 12 డాలర్లు పెరిగి 2030 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 23.18 డాలర్లుగా ఉంది.