Co-Branded Credit Cards: క్రెడిట్ కార్డ్స్ (Credit Cards) అంటే తెలుసు..? ఈజీగా షాపింగ్ చేస్తుంటారు. క్యాష్ బ్యాక్ తీసుకుంటారు. రివార్డ్ పాయింట్స్‌తో షాపింగ్ చేస్తుంటారు. డిస్కౌంట్స్ కూడా పొందుతారు. మనకు డైరెక్ట్ క్రెడిట్ కార్డుల గురించి తెలుసు..? కానీ కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డుల గురించి తెలుసా..? వాటి వల్ల కలిగి ప్రయోజనం ఏంటీ..?
రెగ్యులర్ క్రెడిట్ కార్డుల కన్నా అదనపు ప్రయోజనాలు అందించేవే కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డులు (Co-Branded Credit Cards). నిర్దిష్ట బ్రాండ్లు, వ్యాపారాలు, రిటైలర్లు, సర్వీస్ ప్రొవైడర్లు కలిసి తీసుకొస్తారు. తమ అనుబంధ బ్రాండ్లతో చేసిన లావాదేవీల కోసం ఈఎంఐపై తక్కువ వడ్డీ, ప్రాసెసింగ్ రుసుములపై రాయితీ ఇస్తాయి. మీరు చేసే షాపింగ్, కొనుగోలు చేసే వస్తువుల ఆధారంగా కార్డ్స్ ఉంటాయి.
కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డు (Co-Branded Credit Cards) ఉపయోగించి లావాదేవీలు చేసే వారు ఇచ్చిన మైలురాయి చేరితే యాన్యువల్ ఫీజు మినహాయింపు పొందవచ్చు. మైల్ స్టోన్ రివార్డ్ పాయింట్ల కింద అదనపు ప్రయోజనాలు వస్తాయి. ఆ కార్డ్ సూచించిన మర్చంట్స్ నుంచి నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ ద్వారా కొనుగోలు చేస్తే తక్కువ వడ్డీకి రుణాలను అందిస్తాయి. కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డులను కొత్తగా తీసుకునే వారికి వెల్ కమ్ ఆఫర్ కింద షాపింగ్ కూపన్లు, డిస్కౌంట్లను అందిస్తాయి.
క్రెడిట్ కార్డ్ (Credit Cards) ఎంచుకునే ముందు మీరు దేనిపై ఎక్కువ డబ్బులు ఖర్చు చేస్తున్నారో తెలుసుకోవాలి. ఖర్చుకు తగిన కో బ్రాండెడ్ కార్డు తీసుకోవాలి. ఫీచర్లు, రుసుము, వడ్డీ రేట్లు, ఆఫర్లు, రివార్డ్ పాయింట్లు వంటి ప్రయోజనాలతో పోల్చి చూడండి. మల్టిపుల్ బ్రాండ్ల అనుసంధానంతో తీసుకొచ్చిన క్రెడిట్ కార్డులను (Credit Cards) ఎంచుకుంటే ఫలితం ఉంటుంది. ఏ క్రెడిట్ కార్డు అయినా సరే వాడకం బట్టి చార్జెస్ ఉంటాయి. కార్డ్ నుంచి మనీ తీయొద్దని టెక్ నిపుణులు సూచిస్తున్నారు. అలా తీస్తే.. ఎక్కువ వడ్డీ కట్టాల్సి వస్తోందని అప్రమత్తం చేస్తున్నారు.