»Changing Of Rs 2000 Currency Notes Off To A Slow Yet Smooth Start
Rs.2000 notes: రూ.2వేల నోట్ల మార్పు.. ఎలా జరుగుతుందంటే..!
దేశంలో రూ.2వేల నోటు ను నిషేధిస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో.. ఆ నోటీను బ్యాంకులో ఉపసంహరించుకుంటున్నారు. గతవారం ఈ ప్రక్రియ ప్రారంభం కాగా, సజావుగా సాగుతుందని తెలుస్తోంది.
సెంట్రల్ బ్యాంకింగ్ వర్గాల ప్రకారం, మొదటి వారంలో అత్యధికంగా రూ.2,000 నోట్లు డిపాజిట్ అయ్యాయి, అయితే కేవలం 20 శాతం మాత్రమే మార్చబడ్డాయని అధికారులు చెప్పారు. పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ బ్యాంకు శాఖలు ఎక్కువ కార్యకలాపాలు సాగిస్తున్నాయని బ్యాంకర్లు తెలిపారు. బ్యాంకు శాఖల్లో ఇతర డినామినేషన్ కరెన్సీల కొరత లేదని, ఒకవేళ ఉన్నా కూడా త్వరగా నింపామని బ్యాంకర్లు తెలిపారు.
దేశ వ్యాప్తంగా రూ.2వేల నోట్లను మార్పిడి ప్రక్రియ ఇప్పటికే బ్యాంకుల్లో ప్రారంభమైంది. సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. రోజుకు రూ.20 వేల వరకు మర్చుకునే వెసులుబాటు ఉంది. రూ.2వేల కరెన్సీ నోట్లను మార్చుకునేందుకు, డిపాజిట్ చేసేందుకు ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు ఆర్బీఐ నాలుగు నెలల సమయం ఇచ్చింది. బ్యాంకుల వద్ద రద్దీ లేదని, పరిస్థితిని క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తున్నామని అధికారులు తెలిపారు. పెద్దగా సమస్యలు వచ్చే అవకాశం లేదని భావిస్తున్నామన్నారు. వ్యాపార కార్యకలాపాలు యథావిధిగా సాగుతున్నాయని తెలిపారు. నోట్లను మార్చుకునేందుకు సమయం ఎక్కువగానే ఇచ్చామని, దాంతో సమస్యలు ఎదురయ్యే అవకాశం లేదన్నారు.