»Amazon Once Again Focuses On Ai Instead Of Employees
Amazonలో మరోసారి ఉద్యోగులపై వేటు..ఏఐపై దృష్టి
కృత్రిమ మేధపై దృష్టిపెట్టిన అమెరికా టెక్ దిగ్గజం అమెజాన్ తన అలెక్సా వాయిస్ యూనిట్ విభాగంలో కోతలకు తెరతీసింది. మారిన వాణిజ్య ప్రాధాన్యాలు, జనరేటివ్ ఏఐపై దృష్టి మళ్లించడం తదితర కారణాలతో అలెక్సా వాయిస్ అసిస్టెంట్ విభాగంలో సిబ్బందిని తొలగిస్తున్నట్టు పేర్కొంది.
అమెరికాకు చెందిన ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) మరోసారి ఉద్యోగులకు షాకిచ్చింది. లెక్సవాయిస్ అసిస్టెంట్ విభాగంలో ఉద్యోగులను తొలగిస్తున్నట్లు వెల్లడించింది. మారిన వాణిజ్య ప్రాధాన్యాలు, జనరేటివ్ ఏఐ (AI)పై దృష్టి మళ్లించడం వంటి కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ సంస్థ ప్రతినిధి తెలిపారు. ఎంతమందికి ఉద్వాసన పలికారో వెల్లడించేందుకు అమెజాన్ ప్రతినిధి నిరాకరించారు. జనరేటివ్ ఏఐపై దృష్టి పెట్టాం’’ అని అలెక్సా, ఫైర్ టీవీ వైస్ ప్రెసిడెంట్ డేనియల్ రాష్ పేర్కొన్నారు. ఫలితంగా కొన్ని కార్యక్రమాలకు ముగింపు పలకాల్సి వస్తోందని చెప్పారు.
ఈ మధ్య కాలంలో అమెజాన్ మ్యూజిక్, గేమింగ్ విభాగాలకు వనరుల కేటాయింపును తగ్గించింది. చిన్న చిన్న హింట్లతో భారీ సాఫ్ట్వేర్స్ రూపొందించగలిగే జనరేటివ్ ఏఐఫై ప్రస్తుతం టెక్ కంపెనీలు దృష్టిపెడుతున్నాయి.తాజా లేఆఫ్‌లు (layoffs) అమెరికాతో పాటు ఇతర లొకేషన్లలో పనిచేస్తున్న వారినీ తొలగిస్తున్నట్లు తెలిసింది. అయితే, లేఆఫ్‌కు గురైన ఉద్యోగులకు 60 రోజుల వేతనంతో పాటు ప్రయోజనాలను అందిస్తామని కంపెనీ తెలిపింది. పరిహార ప్యాకేజీ(Package), కొత్త ఉద్యోగంలో వెతుక్కునేందుకు సహకారం వంటివి అందిస్తామని పేర్కొంది. ‘‘మా వ్యాపార అవసరాలకు అనుగుణంగా మా టీమ్‌ను ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంటాం. తాజా రివ్యూలో ఈ కఠినం నిర్ణయం తీసుకున్నాం. మా కమ్యూనికేషన్ (Communication) విభాగంలో స్వల్ప సంఖ్యలో ఉద్యోగుల్ని తొలగిస్తున్నాం’’ అని అమెజాన్ అధికార ప్రతినిధి బ్రాడ్ గ్లాస్సర్ (Brad Glasser) పేర్కొన్నారు. వారి తదుపరి ప్రయాణంలో సహకారం అందిస్తామని పేర్కొన్నారు.
2022 నవంబర్, 2023 జనవరిలో సైతం రెండు దఫాలుగా దాదాపు 18 వేల ఉద్యోగులను అమెజాన్ తొలగించింది. ప్రముఖ సంస్థల్లో గత కొన్ని రోజులుగా ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. అమెజాన్, ట్విట్టర్(Twitter), మైక్రోసాఫ్ట్, మెటా, ఫేస్బుక్ వంటి దిగ్గజ సంస్థలు తమ ఉద్యోగుల్ని ఇంటికి పంపించేశాయి. ఆర్థిక మాంద్యం భయాలతో విడతల వారీగా ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. తాజాగా ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) మరోమారు లేఆఫ్స్ కు తెరలేపింది. ఫార్మసీ (Pharmacy division) యూనిట్ లో కొందరి ఉద్యోగులపై వేటు వేసింది.