Most Used Password: ఈ ఏడాది ఎక్కువ మంది వాడిన పాస్ వర్డ్ ఇదే
ప్రస్తుత కాలంలో సైబర్ మోసాలు క్రమంగా పెరుగుతున్నాయి. అంతేకాదు అనేక మంది ఫోన్లు, ఈమెయిల్స్ కూడా హ్యాకింగ్ కు గురవుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌లో అనేక మంది వారి వ్యక్తిగత సోషల్ మీడియా పాస్ వర్డ విషయంలో అజాగ్రత్తగా ఉంటున్నారని ఓ సర్వే వెల్లడించింది. అంతేకాదు అత్యంత చెత్త పాస్ వర్డ్ ఎంటో కూడా తెలిపింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
ప్రతి దానికీ సెక్యూరిటీ అవసరమే. ముఖ్యంగా మెయిల్స్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ ఇలా ప్రతిదానికీ మనం పాస్ వర్డ్స్ పెడుతూ ఉంటాం. అయితే చాలా మంది కామన్ గా ఉపయోగించే, అతి చెత్త పాస్ వర్డ్ ఏంటో బయటకు వచ్చింది. గ్లోబల్, ఇండియన్ సైబర్ సెక్యూరిటీ ల్యాండ్‌స్కేప్ బలహీనమైన పాస్‌వర్డ్‌లను వాడుతున్నట్లు గుర్తించింది. ప్రపంచ వ్యాప్తంగా భారతీయ వినియోగదారులలో(indians) అత్యంత ప్రజాదరణ పొందిన పాస్‌వర్డ్‌గా ‘123456’ ను గుర్తించారు. అత్యంత చెత్త పాస్ వర్డ్ కూడా ఇదేనని NordPass ఇటీవలి సర్వేలో వెల్లడించింది. ముఖ్యంగా, వినియోగదారులు తమ స్ట్రీమింగ్ ఖాతాలకు పటిష్టత లేని పాస్‌వర్డ్‌లను ఉపయోగించినట్లు గుర్తించారు. భారతీయులే ఎక్కువగా ఈ పాస్ వర్డ్ ని వాడినట్లు గుర్తించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ఇక చాలా మంది తాము ఉన్న ప్రదేశాలను పెట్టి మరీ పాస్ వర్డ్(password) క్రియేట్ చేసుకున్నారట. ఉదాహరణకు ‘India@123’ ఇలంటి పాస్ వర్డ్ లను కూడా ఎక్కువ మంది వాడారట. చాలా మంది వినియోగదారులు తమ ఖాతాలను సురక్షితంగా ఉంచుకోవడం లేదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇటివల కాలంలో సైబర్ బెదిరింపుల భయం ఎక్కువగా ఉన్నప్పటికీ, ‘పాస్వర్డ్’, ‘పాస్@123’ ‘పాస్వర్డ్@123’ వంటి పాస్ వర్డ్స్ ని ఎక్కువగా వాడుతున్నారని నివేదిక వెల్లడించింది. ఈ సైబర్ సెక్యూరిటీ రిస్క్‌లను పరిష్కరించాల్సిన ఆవశ్యకతను నార్డ్‌పాస్ CTO టోమస్ స్మాలాకీస్ చెప్పారు. బాధితులు తమ కంప్యూటర్లలోకి చొరబడే మాల్వేర్ గురించి తెలియకపోవచ్చు. తరచుగా అధునాతన ఫిషింగ్ ఇమెయిల్‌లలో దాగి ఉండవచ్చని సూచించారు. సైబర్ బెదిరింపులు పెరుగుతున్న నేపథ్యంలో మెరుగైన పాస్వర్డ్ భద్రతా చర్యలు అవసరం అని వారు వెల్లడించారు.