డెలివరీ వర్కర్లకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ కామర్స్ రంగంలో పని చేసే గిగ్, ప్లాట్ఫామ్ వర్కర్ల సామాజిక భద్రత కోసం త్వరలో కొత్త పథకాన్ని తీసుకువస్తున్నట్లు తెలిపింది. ఇప్పటివరకు వీరికి ఎలాంటి ఉద్యోగ ప్రయోజనాలు లేవని.. ఇకపై వారికి కూడా పెన్షన్, ఆరోగ్య బీమా వంటి సౌకర్యాలను కల్పించనున్నట్లు వెల్లడించింది. దేశవ్యాప్తంగా సుమారు 70 లక్షల మంది వర్కర్లు ఉండగా.. వచ్చే ఐదేళ్లలో వీరి సంఖ్య కోట్లకు చేరుతుందని అంచనా.