TG: టెక్నికల్ టీచర్ సర్టిఫికెట్ (TTC) పరీక్షల ఫలితాలను ప్రభుత్వ పరీక్షల విభాగం తాజాగా ప్రకటించింది. మొత్తం 3,202 మంది దరఖాస్తు చేసుకోగా.. 3,173 మంది పరీక్షలకు హాజరయ్యారు. వారిలో 3,131 మంది ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణత శాతం 98.68%గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. అభ్యర్థులు ఫలితాలను అధికారిక వెబ్సైట్ http://www.bse.telangana.gov.in/ ద్వారా తెలుసుకోవచ్చు.