»Vinukonda Divyavani Comments After Joins In Congress Party
Divyavani: కాంగ్రెస్ పార్టీలో చేరిన సినీ యాక్టర్ దివ్యవాణి
కాంగ్రెస్ తోనే బంగారు తెలంగాణ సాధ్యమని సినీ నటి, రాజకీయ నేత దివ్య వాణి అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను మరింత ఆసక్తిగా మారుస్తూ బుధవారం దివ్య వాణి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
Divyavani: కాంగ్రెస్ తోనే బంగారు తెలంగాణ సాధ్యమని సినీ నటి, రాజకీయ నేత దివ్య వాణి అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను మరింత ఆసక్తిగా మారుస్తూ బుధవారం దివ్య వాణి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ మాణిక్ ఠాక్రే ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా గాంధీభవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. నీతి, నిజాయితీగా ప్రజల కోసం పనిచేస్తున్న కాంగ్రెస్లో పనిచేయాలనే కాంగ్రెస్ పార్టీలో చేరారన్నారు. పక్క పార్టీలో వేధింపులు భరించలేకే విజయశాంతి కూడా కాంగ్రెస్ గూటికి చేరారని పేర్కొన్నారు.
విజన్ కలిగిన టీడీపీ అధినేత చంద్రబాబు దగ్గర గతంలో పనిచేయడం ఆనందంగా ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల తెలుగు దేశం పార్టీ నుంచి బయటకు వచ్చానని చెప్పారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రతి పేదవాడు బాగుపడాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు. బంగారు తెలంగాణ కావాలంటే నియంత పాలకులను ఓడించి తమ కాంగ్రెస్ పార్టీనే గెలిపించాలని కోరారు. అహంకార ప్రభుత్వంలో బానిస బతుకుల నుండి బయట పడేందుకు కాంగ్రెస్ రావాలని, ప్రజల భవిష్యత్తును కాపాడాలన్నారు. దేశాన్ని కాపాడేది కాంగ్రెస్ మాత్రమే అన్నారు. కార్యకర్తగా తనకు ఏ పని అప్పగించినా తన బాధ్యతగా పనిచేస్తా.. ప్రగతి భవన్ కాదిది ప్రజాభవన్ తమ మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రకటించిందన్నారు. ఆ అంశం తనకు బాగా నచ్చిందని దివ్య వాణి తెలిపారు.