జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి వాహనానికి ఆంధ్ర ప్రదేశ్ లో ఘన స్వాగతం లభించింది. జనసేన వీర మహిళలు హారతులు ఇచ్చి, కొబ్బరికాయ కొట్టి ఆహ్వానించారు. జన సైనికులు ఈలలు, కేకలతో పవన్ పైన పూలు జల్లుతూ కేరింతలు కొట్టారు. పవన్ కళ్యాణ్ వారాహి పై నుండి అందరికీ అభివాదం చేశారు. ఈ వాహనం మంగళగిరి పార్టీ కార్యాలయానికి చేరుకుంటుంది.
అంతకుముందు అర్ధరాత్రి ఈ వాహనం ఆంధ్రలోకి ఎంట్రీ ఇచ్చింది. వాహనానికి మూడు కార్లు ఎస్కార్ట్ గా వచ్చాయి. హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి మీదుగా ప్రయాణించింది. చిలకల్లు టోల్ గేట్ వద్ద మొదలు.. ప్రతిచోట ఈ వాహనాన్ని చూసేందుకు అభిమానులు, ప్రజలు తరలి వచ్చారు. ఈ వాహనం వద్ద నిలబడి సెల్ఫీలు దిగారు.