»Us President Biden Jokes About Ice Cream Before Condemning School Shooting
US school shooting: కాల్పుల ప్రకటనకు ముందు ఐస్క్రీం అంటూ జోబిడెన్ జోకులు, విమర్శలు
అమెరికాలో జరిగిన స్కూల్ కాల్పుల ఘటనపై ( US school shooting) ప్రకటన చేయడానికి వచ్చిన అధ్యక్షులు జో బిడెన్ (US President Joe Biden ) దాని కంటే ముందు, మాట్లాడిన తీరు విమర్శలకు దారి తీసింది.
అమెరికాలో జరిగిన స్కూల్ కాల్పుల ఘటనపై ( US school shooting) ప్రకటన చేయడానికి వచ్చిన అధ్యక్షులు జో బిడెన్ (US President Joe Biden ) దాని కంటే ముందు, మాట్లాడిన తీరు విమర్శలకు దారి తీసింది. కాల్పుల కంటే ముందు ఆయన ఐస్ క్రీమ్ గురించి మాట్లాడుతూ జోకులు పేల్చారు. ఓ బాధాకర సంఘటన జరిగిన సమయంలో చలోక్తులు విసరడం అందరినీ విస్మయానికి గురి చేసింది. కాల్పుల ఘటనకు ముందు ఐస్ క్రీమ్ గురించి ప్రస్తావిస్తూ… నా పేరు జో బిడెన్ (My name is Joe Biden)… నేను డాక్టర్ జిల్ బిడెన్ భర్తను… నేను జెనీస్ ఐస్ క్రీమ్ (ice cream), చాక్లెట్స్, చిప్స్ తింటాను… చాకోలేట్ చిప్స్ ఐస్ క్రీమ్ ఉందని తెలిసి, దాని కోసం నేను ఇక్కడకు వచ్చాను… నేనేమీ జోక్ చేయడం లేదు… నిజమే చెబుతున్నా అని అసందర్భంగా మాట్లాడుతున్నట్లుగా వీడియోలో ఉంది.
ఆ తర్వాత గానీ జో బిడెన్ (America President Joe Biden) కాల్పుల ఘటనపై మాట్లాడలేదు. స్కూల్లో కాల్పుల (Nashville School firing) బాధాకరమని, ఇది తన హృదయాన్ని కలచివేస్తోందని, తుపాకీ హింసను (gun violence) ఆపేందుకు మరింతగా కృషి చేయాల్సి ఉందని కాంగ్రెస్ ను డిమాండ్ చేశారు. ఈ ఘటనను ఖండించారు. ‘ఇది దారుణం. ఏం జరిగింది.. ఎందుకు ఈ కాల్పులు చోటు చేసుకున్నాయనే వాస్తవాలను సేకరిస్తున్నాం. ఇదో పీడకల.’ అన్నారు. నాష్ విల్లేలోని స్కూల్లో కాల్పుల (school shooting at Nashville) నేపథ్యంలో మృతుల గౌరవార్థం వైట్ హౌస్ సహా అన్ని భవనాల్లోని జెండాలను ఎగురవేయాలని ఆదేశించారు. మార్చి 31, 2023 సాయంత్రం వరకు జెండాలు సగానికి ఎగరవేసి ఉంచాలన్నారు. ఇలాంటి ఉదంతాలు పురావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు.
ఈ వీడియో పైన అమెరికన్ నెటిజన్లు పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏం మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఇది ఫాల్స్ వీడియో అని, బిడెన్ ఐస్ క్రీమ్ వ్యాఖ్యలు గతంలోని వుమెన్ సమ్మిట్ సందర్భంలోనివి అని కూడా పలువురు నెటిజన్లు కామెంట్ (Women’s Summit) చేస్తున్నారు. ఇలాంటి ఫేక్ న్యూస్ ను ప్రచారం చేయవద్దన్నారు. ఈ వీడియోను చీఫ్ వైట్ హౌస్ కరస్పాండెంట్ ట్వీట్ చేశారు.
అమెరికాలోని టెన్నిస్సే రాష్ట్రం నాస్ విల్లేలోని ఓ స్కూల్ లో సోమవారం కాల్పులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కాల్పుల్లో ముగ్గురు పిల్లలు సహా ఆరుగురు మృత్యువాత పడ్డారు. కాల్పులకు పాల్పడిన నిందితురాలు కూడా ప్రాణాలు కోల్పోయినట్లుగా పోలీసులు తెలిపారు. ఈ కాల్పులకు తెగబడిన వ్యక్తి ముందుగానే ప్లాన్ ప్రకారం సిద్ధపడ్డాడని చెబుతున్నారు. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తి పేరు ఆడ్రే హాలే. ఇరవై ఎనిమిదేళ్ల వయస్సు ఉంది. ఆ వ్యక్తి లింగ మార్పిడి చికిత్స చేయించుకున్నట్లుగా తెలుస్తోంది. దీంతో పోలీసులు ఆమె అని సంబోధిస్తున్నారు. లింక్డిన్ ప్రొఫైల్ మాత్రం పురుషుడిగా సూచిస్తోంది. ఈ కాల్పులు హఠాత్తుగా జరగలేదని, భారీ ప్రణాళిక అనంతరం కాల్పులు జరపాలని నిర్ణయించుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు.
స్కూల్ ఎంట్రీ ప్రాంతం నుండి లోనికి వచ్చి, కాల్పులు జరుపుతూ భవనంలోకి వెళ్లినట్లు గుర్తించారు. ఈ ఘటనలో చనిపోయిన ముగ్గురు చిన్నారులు తొమ్మిదేళ్ల లోపు వారే. మరో ముగ్గురు 60 ఏళ్ల వయస్సువారు. చనిపోయిన వారిలో పాఠశాల హెడ్ కూడా ఉన్నారు. అనంతరం జరిగిన పోలీసుల కాల్పుల్లో నిందితురాలు మృతి చెందింది. నిందితురాలికి ఎలాంటి నేర చరిత్ర లేకపోవడం, ఉన్నత విద్యావంతురాలు కావడం గమనార్హం.
BREAKING – SHOCKING: Nashville police release footage of transgender mass shooter Audrey Elizabeth Hale. Police wrote that Hale "drove to Covenant Church/School in her Honda Fit this morning, parked, and shot her way into the building. She was armed with 2 assault-type guns and a… pic.twitter.com/anBnt9vPpT