»Up Cops Deliver Mosquito Repellent Coil At Hospital After Man Complains Of Wifes Post Natal Woes
UP cops: భార్యకు దోమలు కుడుతున్నాయని ట్వీట్ చేస్తే.. కాయిల్స్ తెచ్చిచ్చిన పోలీస్
దోమల విషయంలోను ప్రజలకు పోలీసులు సహకరించిన సంఘటన తాజాగా వెలుగు చూసింది. హాస్పిటల్ లో ప్రసవానంతరం ఓ మహిళకు యూపీ పోలీసులు దోమల నివారణ కాయిల్స్ ను అందించారు.
మాఫియా మొదలు రాష్ట్రంలో ప్రజలను ఇబ్బంది పెడుతున్న దోమల వరకు… అన్నింటా ఉత్తర ప్రదేశ్ పోలీసులు (Uttar Pradesh Police) పరిష్కారం చూపిస్తున్నారు! యోగి ఆదిత్యనాథ్ పాలన (yogi adityanath rule in up) కంటే ముందు యూపీలో మాఫియా రాజ్యమేలేది. ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడేవారు. కానీ యోగి అధికారంలోకి వచ్చాక మాఫియా పైన ఉక్కుపాదం మోపుతున్నారు. ఎక్కడికక్కడ కట్టడి చేస్తూ, ప్రజల జీవనం సౌకర్యవంతంగా సాగేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పోలీసులు కూడా ప్రజలకు అనుగుణంగా పని చేస్తున్నారు. మాఫియా విషయాన్ని పక్కన పెడితే… చివరకు దోమల విషయంలోను ప్రజలకు పోలీసులు సహకరించిన సంఘటన తాజాగా వెలుగు చూసింది. హాస్పిటల్ లో ప్రసవానంతరం ఓ మహిళకు యూపీ పోలీసులు దోమల నివారణ కాయిల్స్ ను అందించారు. యోగి పాలనలో రాష్ట్రంలోని సిబ్బంది తమ వృత్తిపరమైన కట్టుబాట్లను మించి ప్రజలకు ఎలా సహాయం చేస్తున్నారో ఇది నిదర్శనంగా చెప్పవచ్చు.
ఉత్తర ప్రదేశ్ లోని (Uttar Pradesh) చందౌసిలోని ఓ హాస్పిటల్ లో ఓ మహిళ ఆడబిడ్డకు జన్మను ఇచ్చింది. ప్రసవం అనంతరం తన భార్య, పాప హాస్పిటల్ లో (Hospital) దోమల వల్ల ఇబ్బందులు పడుతున్నారు. దీంతో సదరు మహిళ భర్త సమీప సంభాల్ పోలీసులను (Sambhal Police) ఆశ్రయించాడు. తన భార్య ఈ రోజు హరిప్రకాశ్ నర్సింహ్ హోం, చందౌసిలో ఆడబిడ్డకు జన్మను ఇచ్చిందని, నిత్యం దోమలు కుట్టడంతో ఇద్దరు ఇబ్బంది పడుతున్నారని, ఇక్కడ దుకాణాలు అన్నీ మూసి ఉన్నాయని, దయచేసి తనకు అత్యవసరంగా మోర్టిన్ కాయిల్ అందించగలరని అతను డయల్ 112 (Dial 112 UP service) సేవల ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చారు.
అతని విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న యూపీ పోలీసులు యూపీ112 పీఆర్వీకి సంబంధించిన ఇద్దరు సిబ్బంది ద్వారా దోమల కాయిల్స్ ను పంపించారు. వెంటనే స్పందించిన పోలీసులకు తన మైక్రో బ్లాగింగ్ సైట్ ద్వారా థ్యాంక్స్ చెప్పారు ఆ భర్త. ఈ పోస్టును యూపీ పోలీసులు షేర్ చేశారు. ఈ పోస్టును ఇప్పటి వరకు 97 వేల మంది చూశారు. 1300కు పైగా లైక్స్ వచ్చాయి.