»Two More Arrested In Tspsc Leakage Case How Many More Are There In This Case
TSPSC leakage case:లో మరో ఇద్దరు అరెస్టు..ఇంకా ఏంతమంది ఉన్నారో?
TSPSC పేపర్ లీకేజీ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా మరో ఇద్దరు వ్యక్తులను సిట్ అధికారులు అరెస్టు చేశారు. దీంతో అరెస్టైన వారి సంఖ్య 21కి చేరింది. ఈ నేపథ్యంలో ఈ కేసులో ఇంకా నిందితులు ప్రశ్నపత్రాలు ఎంత మందికి అమ్ముకున్నారనే వివరాలను సేకరించే ప్రయత్నం చేస్తున్నారు.
తెలంగాణలో TSPSC ప్రశ్నపత్రాల లీకేజీ కేసు(TSPSC leakage case)లో మరో ఇద్దరు అరెస్టయ్యారు. ఈ క్రమంలో వికారాబాద్ ఎంపీడీఓ ఆఫీసులో పనిచేస్తున్న భగవంత్, అతని తమ్ముడు రవి కుమార్ ను సిట్(SIT) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ కేసులో కీలకంగా ఉన్న డాక్యా నాయక్ నుంచి తన తమ్ముడి కోసం భవవంత్ ఏఈ పేపర్ కొనుగోలు చేసినట్లు తెలిసిందని అధికారులు పేర్కొన్నారు. డాక్యా నాయాక్ బ్యాంక్ ఖాతాలను పరిశీలించగా..ఏఈ క్వశ్ఛన్ పేపర్ కొనుగోలు కోసం రెండు లక్షల రూపాయలు ట్రాన్స్ ఫర్ చేసినట్లు తేలిందని చెప్పారు. ఇప్పటివరకు ఈ కేసులో భాగంగా నిందితులకు రూ.33.44 లక్షలు చేరినట్లు అధికారులు వెల్లడించారు.
దీంతో ఈ కేసులో మొత్తం అరెస్టైన వారి సంఖ్య 21కి చేరింది. మరోవైపు ఇంకా ఈ కేసు వ్యవహారంలో ఎంత మంది ఉన్నారనే దానిపై ఉద్యోగార్థులు(job aspirants) సహా అనేక మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విచారిస్తున్న కొద్ది ప్రతి నెల కొంత మంది అరెస్టు అవుతూనే ఉన్నారు. తొలుత ఈ కేసులో 7 మందిని అరెస్టు చేయగా..ప్రస్తుతం ఈ సంఖ్య మూడు రెట్లకు చేరింది. అసలు ప్రధాన నిందితులు ఈ TSPSC ప్రశ్నపత్రాలు ఎంతమందికి అమ్ముకున్నారనేది ఇంకా తేలాల్సి ఉంది. ఈ అరెస్టుల సంఖ్య పెరగడం చూస్తుంటే ఇంకా మరికొంత మంది పేర్లు బయటకు వస్తాయని తెలుస్తోంది.
ఈ కేసు అంశంపై గతంలో మంత్రి కేటీఆర్(KTR) కేవలం ఇద్దరికి మాత్రమే సంబంధముందని చెప్పిన వ్యాఖ్యలను సైతం ఉద్యోగార్థులు గుర్తు చేస్తున్నారు. ఆ ఇద్దరు కాస్తా ఇప్పుడు 20 మందికి దాటిపోయారని అంటున్నారు. ఈ కేసులో ప్రధానంగా ప్రవీణ్, రాజశేఖర్, రేణుక, ఆమె భర్త డాక్యా నాయక్ ప్రధాన నిందితులుగా ఉన్నారు. దీంతో వీరితో ఇంకా ఈ కేసులో ఎంత మందికి లింక్ ఉంది. అనే కోణంలో కూడా అధికారులు వివరాలను సేకరిస్తున్నారు.