»Father And Son Arrested In Tspsc Leakage Case With This Total 19
TSPSC లీకేజీ కేసులో తండ్రి కొడుకులు అరెస్ట్..19కి చేరిన అరెస్టులు
TSPSC పేపర్ లీకేజీ కేసు(TSPSC leakage case)లో సిట్ అధికారులు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. దీంతో ఇప్పటివరకు అరెస్టైన వారి సంఖ్య 19కి పెరిగింది. మరోవైపు హైకోర్టులో ఈ కేసు విచారణ ఈనెల 24న జరగనుంది.
TSPSC పేపర్ లీకేజీ కేసు(TSPSC leakage case)లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా మరో ఇద్దరు వ్యక్తులను సిట్ అధికారులు అరెస్టు చేశారు. ఆ ఇద్దరిని రిమాండ్ కు తరిలించి అధికారులు విచారిస్తున్నారు. వారిలో మహబూబ్ నగర్ కు చెందిన మైసయ్య అతని కుమారుడు జనార్ధన్ లను సిట్ అధికారులు అరెస్టు చేశారు.
అయితే రేణుక భర్త డాక్యా నాయక్ దగ్గర తన కుమారుడైన జనార్ధన్ కోసం ఏఈ పరీక్ష పేపర్ కావాలని రెండు లక్షల రూపాయలు ఇచ్చి తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో వీరిని అదుపులోకి తీసుకున్నారు.
మరోవైపు ఈ కేసులో ప్రవీణ్, రాజశేఖర్, రేణుక, ఆమె భర్త డాక్యా నాయక్ ప్రధాన నిందితులుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టైన వారి సంఖ్య మొత్తం 19కి చేరింది. మరో వైపు ఈ కేసుకు సంబంధించిన విచారణ ఈ నెల 24న హైకోర్టులో విచారణకు రానుంది. ఈ కేసులో ఒక్కొక్కరిని విచారిస్తూ వివరాలను సేకరిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా మరో ఇద్దరిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు.
గ్రూప్-1 ప్రిలిమ్స్ మెరిట్ జాబితాను సేకరించిన సిట్ బృందం.. 100 మార్కులకు పైగా సాధించిన 121 మంది అభ్యర్థులను విచారించి వారి వాంగ్మూలాన్ని నమోదు చేసింది. వారి సామర్థ్యాలను, ప్రతిభను పరీక్షించేందుకు కొన్ని ప్రశ్నలను వారి ముందు ఉంచి ఏ సమయంలో సమాధానాలు రాశారనే వివరాలను ఆరా తీసింది. అదే సమయంలో ఈ కేసులో నిందితులుగా ఉన్న ప్రవీణ్, షమీమ్, రమేష్, సురేష్‌లకు కూడా సంబంధం ఉన్నట్లు తేలింది. మరోవైపు జగిత్యాల జిల్లాలో మెయిన్స్‌లో అర్హత సాధించిన 40 మంది అభ్యర్థులను SIT పరిశీలించి నివేదిక సిద్ధం చేసింది.
ఈ నేపథ్యంలో సిట్ అధికారులు సీల్డ్ కవర్లో హైకోర్టుకు సిట్(SIT) నివేదిక సమర్పించింది. దీనిపై ఏప్రిల్ 24న హైకోర్టు విచారించనుంది. మరోవైపు ఈ ప్రశ్నపత్రాన్ని ఈ ముగ్గురు ఎంతమందికి అమ్మారు సహా తదితర వివరాలను ఇంకా సిట్ అధికారులు విచారించి వాంగ్మూలాన్ని సేకరించినట్లు తెలుస్తోంది.