TSPSC లీకేజీ కేసులో రేణుకకు బెయిల్ మంజూరైంది. నాంపల్లి కోర్టు నిబంధనలతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. ఈ క్రమంలో రూ.50 వేలు కట్టాలని కోర్టు పేర్కొంది.
దీంతోపాటు ప్రతి సోమ, బుధ, శుక్రవారం సిట్ ముందు హాజరుకావాలని కోర్టు వెల్లడించింది. మరోవైపు ఈ కేసులో నిందితులుగా ఉన్న రాజేందర్, రమేష్ లకు కూడా ఇప్పటికే బెయిల్ మంజూరైంది.
మరోవైపు ఈ కేసులో ఇప్పటివరకు సిట్ అధికారులు 23 మందిని అరెస్టు చేశారు. ఇంకా TSPSC ప్రశ్నపత్రాలు ఎంత మందికి నిందితులు అమ్ముకున్నారనే వివరాలను సిట్ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇంకోవైపు నిందితుల నుంచి కూడా సమాచారం సేకరిస్తున్నారు.