ఈరోజు ఏపీలోని అమరావతిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి(cm jagan mohan reddy) పేదలకు ఇళ్లస్థలాల పట్టాలను పంపిణీ చేశారు. ఈ నేపథ్యంలో అందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. వెంకటపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు పక్కనే ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం సమీపంలో భారీ బహిరంగ సభకు కూడా ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఈ సమావేశానికి 51,392 మంది లబ్ధిదారులతోపాటు వారి కుటుంబ సభ్యులు హాజరవుతారని అధికారులు అంచనా వేశారు.
ఈ కార్యక్రమంలో రూ.443.71 కోట్లతో నిర్మించిన 5,024 ఆంధ్రప్రదేశ్ టౌన్షిప్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APTIDCO) ఇళ్లను లబ్ధిదారులకు ముఖ్యమంత్రి అందజేశారు. ఇటీవల, ఆర్థికంగా వెనుకబడిన విభాగం (ఈడబ్ల్యూఎస్) నుంచి లబ్ధిదారులకు ఇంటి స్థలాల పట్టా పంపిణీని నిలిపివేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఆర్ 5 జోన్లో పేద కుటుంబాలకు పట్టాలు ఇవ్వాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి రైతులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలు హౌసింగ్ ఫర్ పూర్ పథకం కింద మొత్తం 25 లేఅవుట్లను అభివృద్ధి చేసింది. పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీకి మొత్తం 25 లేఅవుట్లు సిద్ధం చేశామని, అందులో గుంటూరు జిల్లా(guntur district)కు చెందిన లబ్ధిదారులకు 11 లేఅవుట్లలో ఇళ్ల స్థలాలు ఇవ్వగా, ఎన్టీఆర్ జిల్లాలోని పేద కుటుంబాలకు 14 లేఅవుట్లలో పట్టాలు అందజేయనున్నారు.
300 చ.అ.ల విస్తీర్ణంలో ఉన్న ఇళ్లను కేవలం ఒక్క రూపాయికే లబ్ధిదారులకు అధికార వైఎస్సార్సీపీ(YSRCP) ప్రభుత్వం ఇస్తోంది. టీడీపీ హయాంలో టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తిగా పక్కదారి పట్టిందని వైసీపీ నేతలు ఆరోపించారు.