డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ(ram gopal varma) నిత్యం ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటూనే ఉంటారు. తనకు సంబంధం లేని విషయాల్లో దూరి మరీ వాటిపై తన అభిప్రాయాన్ని చెబుతూ ఉంటాడు. సోషల్ మీడియాలో ఆయన ట్వీట్లు అయితే… నిత్యం దుమారం రేపుతూనే ఉంటాయి. కాగా… బుధవారం ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(jagan mohan reddy)తో రామ్ గోపాల్ వర్మ భేటీ అయ్యారు.
జగన్ నివాసానికి వెళ్లిన వర్మ దాదాపు 40 నిమిషాలపాటు భేటీ అయ్యారు. జగన్ తో కలిసి భోజనం చేసిన తర్వాత రామ్ గోపాల్ వర్మ అక్కడి నుంచి బయలుదేరారు. ఈ భేటీలో వారు తెలుగు సినీ పరిశ్రమ, కార్మికులు, ప్రస్తుత రాజకీయాలపై చర్చించుకున్నట్లు సమాచారం. ఈ సమావేశం గురించి వివరాలు తెలియాల్సి ఉంది.
ఏపీలో ప్రస్తుతం మూడు రాజధానుల అంశం వాడివేడిగా నడుస్తుంది. రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఈ అంశంపై వర్మ సినిమా తీసే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. లేకపోతే ఏపీ రాజకీయాలకు సంబంధించి మరేదైనా సంచలన అంశంపై సినిమా తీయవచ్చని చర్చించుకుంటున్నారు. మరి నిజంగా దాని గురించే భేటీ అయ్యారా..లేక మరేదైనా విషయం పైన మీట్ అయ్యారా అనేది కొద్దిరోజుల తర్వాత ఆయనే చెప్తాడు.