These are the movies releasing in theaters and OTT this week...
ప్రతి శుక్రవారం మాదిరిగానే ఈ వారం కూడా చాలా సినిమా(Cinema)లే అటు థియేటర్లలో, ఇటు ఓటీటీ(OTT)లల్లో విడుదలకు సిద్ధం అయ్యాయి. అందులో మొదటి ప్రేమకు మరణం లేదు మనసు పొరలల్లో శాశ్వతంగా సమాధి చేయబడుతుంది అనే థీమ్ తో ఫీల్ గుడ్ మూవీగా మనముందుకు రాబోతుంది బేబీ(Baby) సినిమా. సాయి రాజేష్ దర్శకత్వంలో హీరో ఆనంద్ దేవరకొండ(Anand Devarakonda), హీరోయిన్ వైష్ణవి చైతన్య(Vaishnavi Chaithanya), విరాజ్ అశ్విన్(Veeraj Ashwin) ల ట్రైయాంగిల్ ప్రేమకథగా ఈ చిత్రాన్ని ప్రముఖ టాలీవుడ్ నిర్మాత ఎస్ కేఎన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రేక్షకులను అలరించడానికి జూలై 14న థియేటర్లో విడుదల కానుంది.
ఉదయనిది స్టాలిన్(Udayanidhi Stalin) హీరోగా, కీర్తి సురేష్(Keerthi Suresh) హీరోయిన్ గా, మలయాళ హీరో ఫాహద్ ఫజిల్, కమెడియన్ వడివేలు ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం మమన్నన్(తెలుగులో నాయకుడు). మారిసెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఈ శుక్రవారం థియేటర్లోకి వస్తుంది. తమిల్ విడుదలై సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా నాయకుడు గా తెలుగులో రాబోతుంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి.
ప్రముఖ తమిళ హీరో శివ కార్తికేయన్(Shiva Karthikeyan) కు తెలుగులో చాలా మంచి మార్కెట్ ఉంది. ఈ నేపథ్యంలో మడోని అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం మహావీరుడు. ఈ చిత్రాన్ని కూడా జూలై 14నే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు నిర్మాత అరుణ్ విశ్వ.
అలాగే నీరోజ్ పుచ్చా, సోనమ్ టెండప్, సుభారంజన్, మహేందర్ బర్గాస్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం భారతీయన్స్. సమైరా సంధు, రాజేశ్వరి చక్రవర్తి, పెడెన్ నాంగ్యాల్ కథానాయికలు. దీన్‌రాజ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. డా.శంకర్‌నాయుడు అడుసుమిల్లి నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా జులై 14న థియేటర్లో విడుదలకు సిద్ధం అయింది.
మిషన్ ఇంపాసిబుల్ సిరీస్‌తో సినీ ప్రియులను అలరించిన హాలీవుడ్ నటుడు టామ్ క్రూజ్(Tom Cruise). ఆయన కీలక పాత్రలో క్రిస్టోఫర్, మెక్ క్యూరీ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ స్పై థ్రిల్లర్ ‘మిషన్ ఇంపాసిబుల్: డెడ్ రెకనింగ్’ (Mission Impossible Dead Reckoning). రెండు భాగాలుగా వస్తున్న ఈ సినిమా పార్ట్-1 జులై 12న ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో విడుదల కానుంది.
ఇక ఓటీటీల విషయానికి వస్తే..నెట్ ఫ్లిక్స్ లో బర్డ్ బాక్స్ బార్సిలోనా అనే ఇంగ్లీష్ ఫిల్మ్ జూలై 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అలాగే కొహరా నేహిందీ సినిమా జూలై 15న విడుదలకు సిద్ధం అయింది. అమెజాన్ ప్రైమ్ లో ట్రాన్స్ ఫార్మర్ రైజ్ ఆఫ్ ది బీస్ట్ అనే హాలీవుడ్ మూవీ జూలై 11న విడుదల అవుతుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన జీ5 లో తెలుగు సినిమా మాయాబజార్ ఫర్ సేల్ జూలై 14 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. సోనీలైవ్ లో క్రైమ్ పెట్రోల్ 48 అవర్స్ అనే హిందీ సినిమా జూలై 10న స్ట్రీమింగ్ కానుండగా… కాలేజీ రొమాన్స్ జూలై 15న స్ట్రీమింగ్ కాబోతుంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో జానకి జాని అనే మలయాళ చిత్రం జూలై 11న, ది ట్రయల్ అనే హిందీ చిత్రం జూలై 14న స్ట్రీమింగ్ అవుతుంది.