»The Shooting Of Swayambhu Starring Nikhil Siddharth As The Hero And Samyukta Menon As The Heroine Has Started Today
Swayambhu: నిఖిల్ సిద్దార్థ్ స్వయంభు లుక్ అరాచకం
స్టార్ హీరో నిఖిల్ సిద్దార్థ్ హీరోగా, సంయుక్త మీనన్ హీరోయిన్గా నటిస్తున్న స్వయంభు సినిమా షూటింగ్ ఈరోజు ప్రారంభమైంది. దీనికి సంబంధించిన కొత్త పోస్టర్ తాజాగా మేకర్స్ రిలీజ్ చేయగా..అది చూసిన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
The shooting of Swayambhu, starring Nikhil Siddharth as the hero and Samyukta Menon as the heroine, has started today.
Swayambhu: కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిన యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ ప్రస్తుతం యమ స్పీడ్‌గా దూసుకెళ్తున్నారు. ఈ మధ్యే స్పై చిత్రంలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని తాజాగా స్వయంభూ అనే మరో పాన్ ఇండియా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నూతన దర్శకుడు భరత్ కృష్ణ మాచారి తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుంచి నిఖిల్ కొత్త లుక్ విడుదలైంది. ఈ లుక్‌లో నిఖిల్ ఓ యువరాజులా యుద్దభూమిలో ఫైట్ చేస్తున్నట్లు గుర్రంపై స్వారీ చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఇప్పటివరకు చూడనటువంటి గెటప్‌లో నిఖిల్ కనిపించడంతో ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ విపరీతమైన ట్రెండ్ అవగా తాజాగా ఈ సినిమా నుంచి నిఖిల్ కొత్త పోస్టర్‌ను విడుదల చేసి మూవీ షూటింగ్ ప్రారంభించినట్లు మేకర్స్ తెలిపారు. ఈ సినిమాలో విరూపాక్ష ఫేమ్ సంయుక్త మీనన్ హీరోయిన్గా నటిస్తోంది. భువన్, శ్రీకర్ కలిసి నిర్మిస్తున్న చిత్రానికి కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు.