»The Rain That Does Not Come Out Hyderabad The Overflowing Canal Telangana
Rain: బయటకు రానియ్యకుండా దంచికొడుతున్న వర్షం..పొంగిపొర్లుతున్న నాలాలు
తెలంగాణ వ్యాప్తంగా వరుసగా రెండో రోజు బుధవారం కూడా వర్షాలు కురుస్తున్నాయి. భారత వాతావరణ శాఖ (IMD) అంచనాల ప్రకారం రాబోయే 24 గంటల్లో వర్షాలు మరింత పెరిగే అవకాశం ఉంది.
వరుసగా రెండో రోజు బుధవారం కూడా ఎడతెరిపిలేని వర్షాలు తెలంగాణలో కురుస్తున్నాయి. రాబోయే రెండు రోజుల్లో మరిన్ని భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం పరిస్థితిని ఎదుర్కొనేందుకు సన్నద్ధమైనప్పటికీ, రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో జన జీవనానికి అంతరాయం ఏర్పడింది. ఇక హైదరాబాద్లో వర్షం కారణంగా అనేక ప్రాంతాల్లో తెల్లవారు జాము నుంచే వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలకు (Lowest Places) నీరు చేరింది. పలుచోట్ల డ్రైనేజీలు (Drainages) మూసుకుపోయి..ఇంకొంన్నిప్రాంతల్లో నాళాల నీరు వరదలా ప్రవహిస్తోంది. ఈ క్రమంలో వాహనదారులు రోడ్లపై ప్రయాణించేందుకు జనాలు నానా తంటాలు పడుతున్నారు. అనేక ప్రాంతాల్లో వరదనీరు రోడ్లపై నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10, కేపీహెచ్ బీ కాలనీ, కూకట్ పల్లి, ఎస్సార్ నగర్, పంజాగుట్ట, లక్డీకాపూల్, కోఠి, మలక్ పేట, దిల్ సుఖ్ నగర్, ఎల్బీ నగర్, ఉప్పల్, సికింద్రాబాద్, బాలానగర్, అఫ్జల్ గంజ్, మెహిదీపట్నం తదితర ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. కాగా వర్షం వలన పలుచోట్ల విద్యుత్ సరఫరాకు (Power Cuts) అంతరాయం ఏర్పడింది. ఇంకా రాగల 48 గంటల్లో ఆదిలాబాద్, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాలు, రాజన్న సిరిసిల్లతోపాటు ఇతర జిల్లాల్లోని కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్లో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లయితే, పరిస్థితిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పురపాలక శాఖ మంత్రి కెటి రామారావు అధికారులను ఆదేశించారు.