తెలంగాణ విద్యాశాఖ మంత్రి(Telangana Educational Minister) సబిత ఇంద్రారెడ్డి(Sabitha Indra Reddy) ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాష్ట్రంలో అనుమతి లేని ప్రైవేట్ యూనివర్సిటీ(Private Universities)లను రద్దు చేయాలనే డిమాండ్‌తో ఎన్ఎస్యూఐ(NSUI) నేతలు సబిత ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేశారు. ఈ తరుణంలో మంత్రి సబిత ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. రాష్ట్రంలోని శ్రీనిధి, గురునానక్ కళాశాలలు విద్యార్థులను మోసం చేస్తున్నాయని, విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతోందని ఎన్ఎస్యూఐ(NSUI) నేతలు ఫైర్ అయ్యారు.
రాష్ట్రంలో అనుమతి లేని ఆయా యూనివర్శిటీల్లో విద్యార్థులకు సెమిస్టర్ పరీక్షలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. అనుమతి లేని ప్రైవేటు యూనివర్సిటీల(Private Universities)ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్ఎస్యూఐ నేతలు భారీ సంఖ్యలో చేరుకుని సబిత(Sabitha Indra Reddy) ఇంటిని ముట్టడించడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
ఎన్ఎస్యూఐ(NSUI) రాష్ట్ర అధ్యక్షులు బల్మూరి వెంకట్(Balmuri Venkat) సహా పలువురి నేతలను పోలీసులు అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. గత కొన్ని రోజుల నుంచి అనుమతి లేని ప్రైవేటు యూనివర్శిటీల(Private Universities)ను రద్దు చేయాలంటూ విద్యార్థి సంఘాలు ఆందోళన చేపడుతున్న సంగతి తెలిసిందే. 2018లో 5 ప్రైవేటు వర్సిటీలకు సర్కార్ అనుమతించిందని, 2021లో కూడా మరో 6 వర్సిటీలకు అనుమతి ఇచ్చిందని బల్మూరి వెంకట్ తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ అనుమతితో నడిపిస్తూ ఉన్న ఆ వర్సిటీలను మూసి విద్యార్థులకు న్యాయం చేయాలని బల్మూరి వెంకట్ కోరారు.