»Ysrcp Bus Yatra Ycp Bus Yatra For 60 Days This Is The Schedule
YSRCP Bus Yatra: 60 రోజుల పాటు వైసీపీ బస్సు యాత్ర.. షెడ్యూల్ ఇదే
రేపటి నుంచి ఏపీ వ్యాప్తగా వైసీపీ నేతలు బస్సు యాత్రను చేపట్టనున్నారు. ప్రతి నియోజకవర్గంలో ఈ యాత్రలు సాగనున్నాయి. మొత్తం 60 రోజుల పాటు బస్సు యాత్రను చేపట్టేందుకు వైసీపీ అధిష్టానం షెడ్యూల్ను విడుదల చేసింది.
ఆంధ్రప్రదేశ్లో మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు వైసీపీ మరిన్ని వ్యూహాలతో ముందుకు సాగుతోంది. గెలుపే లక్ష్యం ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించింది. ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ఇప్పటికే వరుస పర్యటనలు, యాత్రలను చేపట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. అందులో భాగంగా మొదటగా బస్సు యాత్రను చేపట్టాలని సీఎం జగన్ తమ నేతలకు దిశానిర్దేశం చేశారు. సామాజిక న్యాయ యాత్ర పేరుతో యాత్రను చేపట్టనున్నారు. వైసీపీ నేతలతో చర్చించిన తర్వాత వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.
తాజాగా వైసీపీ సామాజిక న్యాయ యాత్రకు సంబంధించిన షెడ్యూల్ను వైసీపీ అధిష్టానం ఖరారు చేసింది. అక్టోబర్ 26వ తేది నుంచి నవంబర్ 9వ తేది వరకూ మొదటి విడత బస్సు యాత్రను చేపట్టేందుకు వైసీపీ నాయకత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది ఆదివారాలు మినహా మిగిలిన రోజుల్లో బస్సు యాత్రను చేపట్టేందుకు వైసీపీ తీర్మానించింది. ఉత్తరాంధ్రలో ఇచ్ఛాపురం, దక్షిణ కోస్తాలో తెనాలి, రాయలసీమలో శింగనమల నుంచి ఈ యాత్ర సాగనుంది.
ఇదిలా ఉంటే రాష్ట్రవ్యాప్తంగా 3 ప్రాంతాల్లో ప్రతి రోజూ వైసీపీ బస్సు యాత్ర సాగనుంది. మొత్తంగా డిసెంబర్ 31వ తేది వరకూ 60 రోజుల పాటు వైసీపీ సభలు, కార్యక్రమాలు జరగనున్నాయి. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో వైసీపీ యాత్రను నిర్వహించేందుకు ప్లాన్ చేేసింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నాయకులు ఈ యాత్రలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. వైసీపీ పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం ప్రజలకు వివరించడమే ఈ యాత్ర ఉద్దేశమని వైసీపీ వర్గాలు తెలిపాయి. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎమ్మెల్సీలు అప్పిరెడ్డి, తలశిల రఘురాంలకు సీఎం జగన్ సమన్వయ బాధ్యతలను అప్పగించడంతో వారి ఆధ్వర్యంలో ఈ బస్సు యాత్ర సాగనుంది.