మార్గదర్శి చిట్ ఫండ్ అక్రమాలు, నిధుల మళ్లింపు కేసులో తెలంగాణ హైకోర్టు ఏపీ సీఐడీకి కీలక ఆదేశాలు జారీచేసింది. మార్గదర్శికి చెందిన 30 మంది మేనేజర్లపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్పష్టంచేసింది.
Margadarsi:మార్గదర్శి (Margadarsi) చిట్ ఫండ్ అక్రమాలు, నిధుల మళ్లింపు కేసులో తెలంగాణ హైకోర్టు ఏపీ సీఐడీకి కీలక ఆదేశాలు జారీచేసింది. మార్గదర్శికి చెందిన 30 మంది మేనేజర్లపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్పష్టంచేసింది. ఈ కేసులో ఇప్పటికే 30 మంది మేనేజర్లకు సీఐడీ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.
రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావును సీబీఐ అధికారులు నిన్న విచారించారు. సీఐడీ విచారణను సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు ఫైల్ చేశారు. రామోజీరావు ఆరోగ్య పరిస్థితి.. విచారించిన తీరుపై పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. సీఐడీ కస్టడీలో ఉన్న మార్గదర్శి ఆడిటర్ గాయపడ్డారని గుర్తుచేశారు. ఈ క్రమంలో నోటీసులు ఇచ్చిన 30 మంది మేనేజర్లపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్పష్టంచేసింది. మార్గదర్శి చిట్ ఫండ్ కేసులో ఏ1గా రామోజీరావు (Ramoji rao) ఉండగా..ఏ2గా శైలజ ఉన్నారు.
మార్గదర్శి (margadarsi) చిట్ ఫండ్స్ నిధుల బదిలీ విషయంలో ఆ సంస్థ మార్చి 21వ తేదీన తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. తమ సంస్థలో సోదాల గురించి రామోజీరావు తరఫు న్యాయవాది వివరించారు. చిట్ ఫండ్ (chit fund) నిధులను బ్యాంకులో (bank) జమ చేయాలి కానీ.. మ్యుచువల్ ఫండ్స్‌కు మళ్లించడంపై ఏపీ సీఐడీ (ap cid) అధికారులు ప్రశ్నించారట. నిధులు బదిలీ చేస్తే.. దుర్వినియోగం అనలేమని అప్పుడు ధర్మాసనం స్పష్టంచేసింది. ఖాతాదారులను మోసం చేశారని అనలేదని పేర్కొంది.
మార్గదర్శికి (margadarsi) సంబంధించి ఖాతాదారులు ఫిర్యాదు చేయలేదని పేర్కొంది. అలాంటి సమయంలో ప్రభుత్వం ఇలాంటి చర్యలకు దిగడంపై హైకోర్టు (high court) ఆశ్చర్యం వ్యక్తం చేసింది. రామోజీరావు, శైలాజా కిరణ్‌పై బలవంతపు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు (high court) స్పష్టం చేసింది. అయినప్పటికీ ఏపీ సీఐడీ నోటీసులు ఇచ్చి.. విచారించింది. దీంతో మరోసారి హైకోర్టును ఆశ్రయించగా.. ఏపీ సీఐడీకి తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.