»Ys Bhaskar Reddy Filed Another Petition At High Court
Bhaskar reddy:వివేకా హత్య కేసులో కీలక పరిణామం.. హైకోర్టులో భాస్కర్ రెడ్డి మరో పిటిషన్
వైఎస్ వివేకా హత్య కేసులో ఈ రోజు కీలక పరిణామం చోటుచేసుకుంది. వైఎస్ భాస్కర్ రెడ్డి మరో పిటిషన్ వేశారు. వివేకా హత్య కేసులో ఏ-4గా ఉన్న దస్తగిరిని సీబీఐ అఫ్రూవర్‌గా ప్రకటించడాన్ని సవాల్ చేశాడు.
YS Bhaskar reddy filed another petition at high court
YS Bhaskar reddy:వైఎస్ వివేకా (ys viveka) హత్య కేసులో ఈ రోజు కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎంపీ అవినాశ్ రెడ్డి (avinash reddy) తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి (YS Bhaskar reddy) మరో పిటిషన్ వేశారు. ఇప్పటికే ఓ పిటిషన్ వేసిన ఆయన.. ఇప్పుడు కూడా మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. వివేకాందరెడ్డి (viveka) హత్య కేసులో ఏ-4గా ఉన్న దస్తగిరిని అఫ్రూవర్‌గా ప్రకటించడాన్ని ఆయన సవాల్ చేశాడు.
దస్తగిరి (dastagiri) ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా తమపై నేరం మోపడం సరికాదన్నారు. సీబీఐ (cbi) అధికారులు చెప్పినట్టుగానే దస్తగిరి వాంగ్మూలం ఇస్తున్నాడని తెలిపారు. వివేకానంద హత్య కేసులో దస్తగిరిది కీ రోల్.. ఆయనకు బెయిల్ ఇవ్వకూడదని అంటున్నారు. ఆయుధం కొనుగోలు చేసింది కూడా దస్తగిరి అని చెప్పారు. బెయిల్ ఇచ్చే విషయంలో దస్తగిరికి సీబీఐ సహకరించిందని పేర్కొన్నారు. అందుకే దస్తగిరికి ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని తెలంగాణ హైకోర్టును (high court) కోరారు. ఇప్పుడే కాదు గత నెల 20వ తేదీన కూడా భాస్కర్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. అప్పుడు కూడా దస్తగిరి అంశాన్ని ప్రస్తావించారు. ఇప్పుడు మరోసారి పిటిషన్ వేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇటీవల పులివెందులకు చెందిన పీబీసీ ఉద్యోగి సుధాకర్‌ను (sudhakar) సీబీఐ అధికారులు విచారించారు. ఎంపీ అవినాష్‌రెడ్డితో (avinash reddy) ఫోటో దిగిన విషయంపై ప్రశ్నించినట్లు తెలుస్తోంది. హత్య జరిగిన రోజు వివేకానందరెడ్డి ఇంటికి వచ్చిన వారిలో కొందరిని సీబీఐ విచారణకు పిలిచింది. వివేకా (viveka murder case) హత్య కేసులో ఇప్పటికే సీఎం జగన్ ఓఎస్డీ కృష్ణ మోహన్ రెడ్డి (krishna mohan reddy), జగన్ భార్య భారతి (bharathi) పీఏ నవీన్ (naveen)ను విచారించారు.