»Telangana Government Gave Good News Distribution Of Podu Lands Pattas From June 30
Telangana: శుభవార్త చెప్పిన తెలంగాణ సర్కార్..జూన్ 30 నుంచి పోడు భూముల పట్టాల పంపిణీ
జూన్ 30వ తేది నుంచి పోడు భూముల పట్టా పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలంగాణ సర్కార్ తెలిపింది. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఈ పట్టాల పంపిణీ సాగనుంది.
తెలంగాణ(Telangana) సర్కార్ గిరిజనులకు గుడ్ న్యూస్ చెప్పింది. పోడు భూముల(Podu Lands) పట్టాల పంపిణీకి సర్వం సిద్ధం చేసింది. నిజానికి జూన్ 24 నుంచే పట్టాల పంపిణీ(Pattas Distribution) చేయాల్సి ఉంది. అయితే ఆ తేదిని మారుస్తూ ప్రభుత్వం ప్రకటన చేసింది. జూన్ 30వ తేది నుంచి పోడు భూముల పట్టాల పంపిణీ చేపట్టనున్నట్లు వెల్లడించింది.
ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం నుంచి జూన్ 30న పోడు పట్టాల పంపిణీ(Podu Lands Patta Distribution) చేపట్టనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఆ తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలు వారి వారి నియోజకవర్గాల్లో పట్టాలను పంపిణీ చేయనున్నారు. కొన్ని అనివార్య కారణాల వల్లే పోడు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని జూన్ 30వ తేదికి మార్చినట్లు అధికారులు వెల్లడించారు.
తెలంగాణ(Telangana)లో జాతీయ ఎన్నికల కమిటీ పర్యటిస్తుండటమే కాకుండా శుక్ర, శనివారాల్లో జిల్లా కలెక్టర్లకు శిక్షణా తరగతులు ఉన్నాయి. అంతేకాకుండా 29వ తేదిన బక్రీద్(Bakrid) పండుగ కూడా ఉందటంతో వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని జూన్ 30కి పోడు పట్టాల(Podu Lands Patta Distribution)ను పంపిణీని వాయిదా వేసినట్లు తెలుస్తోంది. జూన్ 30న సీఎం కేసీఆర్(Cm Kcr) చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది.