Ashu Reddy: డ్రగ్స్ కేసులో కబాలి నిర్మాత కేపీ చౌదరి (KP Chaudhary) పట్టుబడటంతో.. ఇండస్ట్రీలో ఇతరులు డ్రగ్స్ తీసుకుంటున్నారనే చర్చ జరుగుతోంది. పలువురు ప్రముఖుల పేర్లు బయటకు వచ్చాయి. వారిలో ఒకరు బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి (Ashu Reddy).. దీంతో ఆమె స్పందించారు.
‘తనపై తప్పుడు ప్రచారం జరుగుతుందని అషు రెడ్డి (Ashu Reddy) అన్నారు. డ్రగ్స్‌కు సంబంధించి ఎవరితో తనకు సంబంధాలు లేవన్నారు. తనపై వచ్చిన, వస్తోన్న వార్తలు నిరాధారం అని తేల్చిచెప్పారు. సంబంధిత వ్యక్తల గురించి సమయం వచ్చినప్పుడు చెబుతానని తెలిపారు. తన పర్మిషన్ లేకుండా ఫోన్ నంబర్ ప్రచురిస్తే ఊరుకోబోనని తేల్చిచెప్పారు. తనపై ఆరోపణలు ఎందుకు వస్తున్నాయో అర్థం కావడం లేదని’ అషురెడ్డి అన్నారు. బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొన్న ఓ నటితో కేపీ చౌదరి వందల సంఖ్యలో ఫోన్ కాల్స్ మాట్లాడారు. దీంతో అషురెడ్డి (Ashu Reddy) పేరు బయటకు వచ్చింది. ఇతర నటుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. తన పేరు రావడంతో అషురెడ్డి రియాక్ట్ అయ్యారు.
డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన కేపీ చౌదరి (KP Chaudhary) పోలీసుల కస్టడీలో కీలక వివరాలు చెప్పాడట. సెలబ్రిటీలు, పొలిటిషీయన్స్ కుమారులకు డ్రగ్స్ అమ్మానని చెప్పాడట. 12 మందికి డ్రగ్స్ సరఫరా చేశానని చౌదరి అంగీకరించాడు. 11 అనుమానాస్పద లావాదేవీలను పోలీసులు గుర్తించారు. రఘు తేజా, సనా మిశ్రా, సుశాంత్ రెడ్డి, నితినేశ్, బెజవాడ భరత్, శ్వేత, ఠాగూర్ ప్రసాద్ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేశానని కేపీ చౌదరి చెప్పారని కస్టడీ రిపోర్టులో పోలీసులు తెలిపారు.
కేపీ చౌదరి (KP Chaudhary) ప్రొడ్యూసర్‌గా మాత్రమే తనకు తెలుసు అని నటుడు సుశాంత్ రెడ్డి తెలిపారు. కొన్నిసార్లు కలిశానని.. అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడేవాడినని తెలిపారు. తనకు డ్రగ్స్ అలవాటు లేదని.. డ్రగ్స్ సరఫరాతో సంబంధం లేదని స్పష్టంచేశారు. ఏ టెస్టులకు అయినా సిద్దమని సుశాంత్ రెడ్డి తెలిపారు.