»Telagnana High Court Taken Suomoto On Child Dog Bite
high court suomoto on dog bite:బాలుడిపై కుక్కల దాడి, సుమోటోగా స్వీకరించిన హైకోర్టు
high court suomoto on dog bite:చిన్నారి ప్రదీప్‌పై (pradeep) కుక్కల దాడి ఘటనను తెలంగాణ హైకోర్టు (high court) సుమోటోగా స్వీకరించింది. ఈ ఘటనపై తీవ్ర దుమారం చెలరేగింది. పలు చోట్ల కుక్కల దాడులకు సంబంధించిన అంశాలు వెలుగులోకి వచ్చాయి.
telagnana high court taken suomoto on child dog bite
high court suomoto on dog bite:చిన్నారి ప్రదీప్‌పై (pradeep) కుక్కల దాడి ఘటనను తెలంగాణ హైకోర్టు (high court) సుమోటోగా స్వీకరించింది. ఈ ఘటనపై తీవ్ర దుమారం చెలరేగింది. పలు చోట్ల కుక్కల దాడులకు సంబంధించిన అంశాలు వెలుగులోకి వచ్చాయి. నిన్న దేశవ్యాప్తంగా కుక్కల దాడి అంశం ట్రెండింగ్ అయ్యింది. ప్రదీప్‌పై (pradeep) కుక్కల దాడి చేసి చంపేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన వార్తల్లో వస్తోంది. దీనిని తెలంగాణ (telangana) హైకోర్టు (high court) సమోటోగా స్వీకరించింది.
మీడియా కథనాల ఆధారంగా విచారణకు తీసుకుంటున్నామని న్యాయస్థానం (court) వెల్లడించింది. వీధి కుక్కల అంశంలో జీహెచ్ఎంసీ (ghmc) ఏం చేస్తోందని ప్రశ్నించింది. ఘటనలో నిర్లక్ష్యం కనిపిస్తోందని అభిప్రాయపడింది. వివరణ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (cs), జీహెచ్ఎంసీ కమిషనర్ (ghmc), హైదరాబాద్ జిల్లా కలెక్టర్ (hyderabad collectotr), అంబర్ పేట మున్సిపల్ అధికారికి నోటీసులు జారీ చేసింది. బాలుడి మృతి బాధాకరం అని, నష్ట పరిహారం అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంది.
అంబర్ పేటలో వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. కుక్కల బారి నుంచి తప్పించుకోవడానికి శక్తి మేర ప్రయత్నించిన లాభం లేకుండా పోయింది. కుక్కలన్నీ కలిసి ఆ చిన్నారిని దాడి చేయడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై తెలంగాణ హైకోర్టు స్పందించింది. సుమోటోగా స్వీకరించి.. రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది.
నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండల కేంద్రానికి చెందిన గంగాధర్ (gangadhar) నాలుగేళ్ల క్రితం ఉపాధి కోసం హైదరాబాద్ వచ్చాడు. అంబర్ పేట ‘చే నెంబర్’ చౌరస్తాలో ఉన్న ఓ కారు సర్వీస్ సెంటర్లో వాచ్ మెన్‌గా (watchmen) పని చేస్తున్నాడు. భార్య, కూతురు, కుమారుడు కలిసి అంబర్ పేట ఎరుకుల బస్తీలో ఉంటున్నాడు. గంగాధర్ ఇద్దరు పిల్లలను ఆదివారం వెంట బెట్టుకుని తాను పనిచేస్తున్న సర్వీస్ సెంటర్‌కు (service centre) వెళ్లాడు. కుమార్తెను పార్కింగ్ ప్రదేశం వద్ద ఉన్న క్యాబిన్లో ఉంచి, కుమారుడిని సర్వీస్ సెంటర్ లోపలికి తీసుకెళ్లాడు. అతను అక్కడ ఆడుకుంటూ ఉండటంతో మరో వాచ్ మెన్‌తో కలిసి పని మీద బయటికి వచ్చాడు. కాసేపు అక్కడే ఆడుకున్నాడు. ఆ తర్వాత అక్క (sister) కోసం క్యాబిన్ వైపు నడుచుకుంటూ వచ్చాడు. ఆ సమయంలో వీధి కుక్కలు వెంటపడ్డాయి. దాడి చేసి, ఆ చిన్నారిని చిదిమేశాయి. ఈ ఘటన ప్రతీ ఒక్కరినీ కలచివేశాయి.
అంబర్ పేట (amberpet) ఘటన బాధాకరం అంటున్నారు. చాలా చోట్ల ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నామని చెబుతున్నారు. కుక్కలను నియంత్రించాలని ముక్త కంఠంతో నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఇటు అంబర్ పేటలో ప్రదీప్‌పై (pradeep) దాడి చేసిన కుక్కలను గ్రేటర్ వెటర్నరీ విభాగం సిబ్బంది పట్టుకున్నారు. ఛే నంబర్, గోల్నాక (golnaka), శంకర్ నగర్ (shankar nagar) ప్రాంతాల్లో వెతికి మరీ పట్టుకున్నారు. వాటితోపాటు 33 కుక్కలను పట్టుకుని కూకట్ పల్లిలో గల మహాదేవ్ పూర్లో ఉన్న డాగ్ కేర్ సెంటర్‌కు తరలించారు.