టీమిండియా క్రికెటర్ జోగిందర్ శర్మ అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్లతో పాటు దేశవాలీ క్రికెట్‌కు ఆయన గుడ్ బై చెప్పారు. శుక్రవారం బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ)కు జోగిందర్ శర్మ తన రిటైర్మెంట్ లేఖను పంపాడు. ఇన్నిరోజులూ తనకు సహకరించిన బీసీసీఐకి, హర్యానా క్రికెట్ అసోసియేషన్‌కు, చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు.
Announced retirement from cricket Thanks to each and everyone for your love and support 🙏❤️👍👍 pic.twitter.com/A2G9JJd515
టీమిండియా జట్టులో ఉన్నప్పుడు తనకు అమూల్యమైన సూచనలు, సలహాలు ఇచ్చిన కోచ్‌లకు, సపోర్టింగ్ స్టాఫ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తనమీద ప్రేమతో త్యాగాలు చేసిన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు కూడా ఆయన కృతజ్ఞతలు చెప్పారు. కుడిచేతి వాటం పేస్ బౌలర్ అయిన జోగిందర్ నాలుగు టీ20లు, నాలుగు వన్డే మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. అయితే 2007 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు విజయంలో జోగిందర్ కీలకపాత్ర పోషించాడు. ఇకపోతే ఐపీఎల్లో చెన్నైసూపర్ కింగ్స్ తరపున జోగిందర్ శర్మ 16 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ఈ మ్యాచుల్లో 12 వికెట్లు తీశాడు. ప్రస్తుతం జోగిందర్ శర్మ హర్యానా పోలీస్ డిపార్టుమెంట్లో డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు.