గణతంత్ర దినోత్సవం సందర్భంగా తన హిందూపురం నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ విస్తృతంగా పర్యటించారు. హిందుపురం, లేపాక్షి తదితర ప్రాంతాల్లో పర్యటించారు. జెండా వందనాలు చేసిన అనంతరం తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వరుస కార్యక్రమాలతో బిజీబిజీగా గడుపుతున్న బాలకృష్ణకు త్రుటిలో ప్రమాదం తప్పింది. ప్రచార వాహనంపై నుంచి బాలయ్య పడబోయాడు. వెంటనే టీడీపీ నాయకులు పట్టుకోవడంతో ప్రమాదం తప్పింది.
హిందూపురంలో గురువారం సాయంత్రం ప్రచార వాహనంపై బాలకృష్ణ కలియ తిరిగారు. అభిమానులు, నాయకులు, ప్రజలకు అభివాదం చేస్తూ వెళ్తున్నారు. ఈ సమయంలో వాహనం డ్రైవర్ వేగంగా వాహనాన్ని ముందుకు కదిలించడంతో బాలయ్య ఒక్కసారిగా కిందపడపోయారు. నిలబడలేకపోయి అదుపు తప్పి వాహనంలోనే అలాగే కూర్చుండిపోయారు. టీడీపీ నాయకులు చేదోడుగా నిలువడంతో బాలకృష్ణ కూలబడిపోయాడు. పక్కన నాయకులు లేకపోతే బాలకృష్ణ వాహనంపై నుంచి కింద పడిపోయేవాడు.