»Tcs Ceo Rajesh Gopinathan Quits K Krithivasan To Replace Him
TCS CEO: రాజేష్ గోపినాథన్ రాజీనామా, కొత్త సీఈవో కృతివాసన్
దేశీయ ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) సీఈవో పదవికి రాజేష్ గోపినాథన్ రాజీనామా (TCS CEO Rajesh Gopinathan quits) చేశారు. 2017 ఫిబ్రవరి నుండి ఆయన సీఈవోగా (CEO) ఉన్నారు.
దేశీయ ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) సీఈవో పదవికి రాజేష్ గోపినాథన్ రాజీనామా (TCS CEO Rajesh Gopinathan quits) చేశారు. 2017 ఫిబ్రవరి నుండి ఆయన సీఈవోగా (CEO) ఉన్నారు. అంతకుముందు 2013 నుండి 2017 వరకు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ గా (Chief Financial Officer) పని చేశారు. కంపెనీ ఆయన స్థానంలో కే కృతివాసన్ ను ఇంచార్జి సీఈవోగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆదేశాలు తక్షణం అమలులోకి వస్తాయని పేర్కొంది. ఈ మేరకు సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది. గోపీనాథన్ టీసీఎస్‌లో (TCS) రెండు దశాబ్దాలకు పైగా సేవలు అందించారు. కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్‌గా, సీఈవో ఆరేళ్లు సేవలందించారు. వచ్చే సెప్టెంబర్ 15, 2023 వరకు ఆయన కంపెనీలో సేవలు అందిస్తారు. గత ఏడాది ఆయనను మరోసారి అపాయింట్ చేసారు.
కృతివాసన్ (K Krithivasan) వచ్చే ఆర్థిక సంవత్సరం పూర్తిస్థాయి సీఈవోగా నియాకమకం కానున్నారు. ఆయన ప్రస్తుతం కంపెనీలు బ్యాకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్ వ్యాపార విభాగానికి అధ్యక్షుడు, గ్లోబల్ హెడ్‌గా ఉన్నారు. 1989 లో కంపెనీలో చేరిన ఆయన 34 ఏళ్లుగా కంపెనీతో కలిసి పని చేస్తున్నారు. కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, లార్జ్ ప్రోగ్రామ్ మేనేజ్మెంట్, సేల్స్ తదితర విభాగాల్లో సేవలందించారు. అలాగే టీసీఎస్ ఐర్లాండ్ డైరెక్టర్ల బోర్డ్, టీసీఎస్ టెక్నాలజీ సొల్యూషన్స్ ఏజీ పర్యవేణ బోర్డు సభ్యుడిగా ఉన్నారు. ఆయన మద్రాస్ విశ్వవిద్యాలయం నుంచి మెకానికల్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ అందుకున్నారు. అలాగే ఐఐటీ కాన్పూర్ నుంచి ఇండస్ట్రియల్ అండ్ మేనేజ్మెంట్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీని పొందారు.
గత పాతికేళ్లుగా రాజేష్ గోపినాథన్ తో పని చేయడం తనకు సంతోషంగా ఉందని టీసీఎస్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ అన్నారు. వివిధ పాత్రల్లో అద్భుతంగా పని చేశారన్నారు. గత ఆరేళ్లుగా ఎండీగా, సీఈవోగా టీసీఎస్ ను మరింత ఉన్నత శిఖరాలకు తీసుకు వెళ్లాడన్నారు. టీసీఎస్ కు ఆయన కాంట్రిబ్యూషన్ పట్ల తాను ఆనందపడుతున్నానని, అతని భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.