టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సీబీఐ విచారణపై సస్పెన్స్ కొనసాగుతోంది. డిల్లి లిక్కర్ స్కామ్ లో….కవితకు సీబీఐ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆ నోటీసుల ప్రకారం…. ఈ నెల 6వ తేదీన విచారణ జరగాల్సి ఉంది. అయితే….. ఆ విచారణ విషయంలో… సీబీఐ కి కవిత లేఖ రాశారు. తాను విచారణకు సిద్దంగా లేనని ఆమె లేఖలో పేర్కొన్నారు. ముందుగా అనుకున్న విధంగా తాను డిసెంబర్ 6 వ తేదీన అందుబాటులో ఉండలేనని, ముందుగా ఖరారైన కార్యక్రమాల వలన ఈరోజు సమావేశం కాలేనని ఎమ్మెల్సీ కవిత సీబీఐకి లేఖ రాశారు.
ఈ లేఖలో 11,12,14,15 తేదీల్లో అందుబాటులో ఉంటానని, ఆ తేదీల్లో ఒక తేదీన సమావేశం ఖరారు చేయాలని సీబీఐకి లేఖ రాశారు. అయితే, ఈలేఖపై సీబీఐ నుంచి ఇంకా ఎలాంటి సమాధానం రాలేదు. ఈరోజు ఉదయం 11 గంటల తరువాత కవిత జగిత్యాల బయలుదేరి వెళ్లనున్నారు.
రేపు జగిత్యాలలో సీఎం కేసీఆర్ సభ జరగనున్నది. ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లను సమీక్షించాల్సి ఉన్నందున ఈరోజు సమావేశానికి హాజరుకాలేనని తెలిపింది. అయితే, నాలుగు తేదీలపై సీబీఐ ఇంకా ఎలాంటి రిప్లై ఇవ్వలేదు. తాను దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తానని కవిత ప్రకటించింది. ఎమ్మెల్సీ కవిత రిప్లైపై సీబీఐ ఎలా స్పందిస్తుందో చూడాలి.