»Supreme Court Asked To Andhra Pradesh Government For Corona Death Compensation
Coronaతో చనిపోయిన కుటుంబాలకు పరిహారం ఇవ్వండి, ఏపీ సర్కార్‌కు సుప్రీంకోర్టు ఆదేశం
కరోనాతో మృతిచెందిన కుటుంబాలను ఆదుకుంటామని ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని పల్లా శ్రీనివాస రావు అనే వ్యక్తి సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
Supreme Court asked to andhra pradesh government for corona death compensation
Supreme Court:కరోనా వైరస్ (coronavirus) కల్లోలం రేపింది. సెకండ్ వేవ్‌లో అయితే జనాలు పిట్టల్లా రాలిపోయారు. కరోనాతో మృతిచెందిన కుటుంబాలను ఆదుకుంటామని ప్రభుత్వాలు ప్రకటించాయి. కానీ ఆచరణలో చూపించలేదు. దీంతో పల్లా శ్రీనివాస రావు (palla srinivasa rao) అనే వ్యక్తి సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును (supreme court) ఆశ్రయించారు. ఆంధ్రప్రదేశ్‌లో కరోనాతో (corona) చనిపోయిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవడం లేదని చెప్పారు.
రాష్ట్రంలో 14 వేల మందికి పైగా కరోనా వైరస్ (coronavirus) సోకి చనిపోయారని వివరించారు. కొందరు పిల్లలు తల్లిదండ్రులను (parents) కోల్పోయి అనాథలుగా దయనీయ స్థితిలో చిక్కుకున్నారని పేర్కొన్నారు. పిటిషన్ విచారణ చేపట్టిన సర్వోన్నత ధర్మాసనం ప్రభుత్వ తీరును తప్పుపట్టింది. కరోనా మృతుల కుటుంబాలకు వెంటనే పరిహారం ఇవ్వాలని ఆదేశాలు జారీచేసింది.
రాష్ట్రంలో నష్ట పరిహారం అందజేయని అంశాన్ని పరిశీలించాలని ఏపీ స్టేట్ లీగల్ ఎయిడ్ సర్వీసెస్ అథారిటీకి స్పష్టంచేసింది. ఈ మేరకు ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో కరోనా వైరస్ (coronavirus) సోకి ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన వారికి ఆర్థికంగా ప్రయోజనం కలుగనుంది.
ఇప్పుడు కూడా కరోనా కేసులు (corona cases) పెరుగుతున్నాయి. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. రోజు 6 వేల వరకు కొత్త కేసులు వస్తున్నాయి. దీంతో చాలా రాష్ట్రాలు అప్రమత్తం అయ్యాయి. మళ్లీ మాస్క్ (mask) మ్యాండెటరీ చేశాయి.