బాలీవుడ్లో భారీ హిట్ దిశగా ‘స్త్రీ 2’ బాక్స్ ఆఫీస్ వద్ద చరిత్ర సృష్టిస్తుంది. రాజ్‌కుమార్ రావు, శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా, రిలీజ్ అయిన మొదటి రెండు రోజుల్లోనే 100 కోట్ల నెట్ కలెక్షన్లను సాధించటంతో బాలీవుడ్ వర్గాల్లో సంచలనంగా మారింది.
స్త్రీ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా మొదటి రోజు (ప్రీమియర్ షోలను కలుపుకొని) 60 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసింది. రెండవ రోజు నాటి కలెక్షన్లు 30 కోట్ల రూపాయలు కాగా, ఇది రోజు రోజుకీ పెరుగుతూ కొనసాగుతుంది. ఇదే ట్రెండ్ కొనసాగితే ఈ చిత్రం 2024 సంవత్సరంలో అత్యధిక కలెక్షన్లను సాధించే సినిమాగా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటివరకు 290 కోట్లతో కల్కి ఈ ఏడాది కలెక్షన్స్ పరంగా బాలీవుడ్ బెస్ట్ ఫిలింగా ఉంది
‘స్త్రీ 2’ సినిమాపై ప్రేక్షకుల ఉత్సాహం, సూపర్ హిట్ టాక్‌తో పాటు, పాజిటివ్ రివ్యూలు ఈ సినిమా విజయానికి కారణమయ్యాయి. మొదటి పార్ట్ ఫుల్ రన్ లో 130 కోట్లు వసూలు చేస్తే, సీక్వెల్ మాత్రం మొదటి వీకెండ్ పూర్తయ్యేసరికి 175 కోట్లు పైన వసూలు చేసే ట్రెండ్ కనిపిస్తుంది