»Should Stay Away From That Anchor Manjusha Auto Ramprasad And Jd Comments Viral
Anchor: కు దూరంగా ఉండాలి.. రాంప్రసాద్, జేడీ కామెంట్స్ వైరల్!
జబర్ధస్త్ షోతో ఎంతో పాపులారిటినీ సొంతం చేసుకున్నాడు ఆటో రాంప్రసాద్. సుడిగాలి సుధీర్ టీమ్ లీడర్‌గా గెటప్ శ్రీను, రాం ప్రసాద్ చేసే హంగామా మామూలుగా ఉండదు. ప్రస్తుతం సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను సినిమాలతో బిజీ అయిపోయారు. రాం ప్రసాద్ కూడా సినిమాలు చేస్తున్నాడు. అయితే తాజాగా ఓ సాంగ్‌లో లాంచ్ ఈవెంట్లో జేడీ చక్రవర్తితో కలిసి యాంకర్ పై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఇప్పటి వరకు నివృతి వైబ్స్ యూట్యూబ్ ఛానల్ వారు అందించిన పాటలు సూపర్, డూపర్ హిట్స్‌గా నిలిచాయి. దేత్తడి హారిక, విష్ణు ప్రియ, పూజిత పొన్నాడ, అక్సా ఖాన్ లాంటి వారితో ఎన్నో ఫోక్ సాంగ్స్ చేశారు. ఇక ఇప్పుడు వీజే జయతి నటించి, నిర్మించిన నా ఫ్రెండ్‌దేమో పెళ్లి.. అనే మ్యూజిక్ ఆల్బమ్‌ను ఘనంగా రిలీజ్ చేశారు. ఈ పాటకు భీమ్స్ సంగీతం అందించారు. కాసర్ల శ్యామ్ సాహిత్యాన్ని అందించారు.
ఈ మ్యూజిక్ ఆల్బమ్ రిలీజ్ వేడుకలో ఆటో రాంప్రసాద్(Auto Ramprasad), జేడీ చక్రవర్తి(jd chakravarthy) ముఖ్య అథితులగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జేడీ చక్రవర్తి, రాంప్రసాద్, యాంకర్ మంజూష మధ్య ఇంట్రెస్టింగ్ కన్వర్జేషన్ జరిగింది.
రాం ప్రసాద్ మాట్లాడుతూ.. ‘నివృతి వైబ్స్‌కు థాంక్స్ చెప్పుకోవాల్సిందే. సినిమా పాటలకు ధీటుగా తీస్తున్నారు. జయతి గారు వెన్నెల ప్రోగ్రాంలో ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలానే ఉన్నారు. టీవీలో ఆమెను చూసినప్పటి నుంచి ఫాలో అవుతున్నానని అన్నాడు. అయితే రాం ప్రసాద్ స్పీచ్ మధ్యలో జేడీ నవ్వులు పూయించాడు.
జయతిని ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నానని రాంప్రసాద్ చెప్పగానే.. ఆమెను దూరంగా చూస్తున్నావా అని అన్నాడు జేడీ. అవును.. కొందరిని దూరంగా ఉండి చూడాలి అని రాంప్రసాద్ చెప్పాడు.
మరి అలాంటప్పుడు యాంకర్ మంజూష దగ్గరికి వెళ్లు అన్నాడు జేడీ. లేదు.. ఆమెకు దూరంగానే ఉండాలి. ఎందుకంటే మీరు చెప్పినట్టు ఆమె పువ్వు కంటే సున్నితంగా ఉంటారని.. చెప్పాడు రాం ప్రసాద్. మొత్తంగా జేడీతో కలిసి రాంప్రసాద్ సెటైర్స్ సాంగ్ లాంచ్‌లో హైలెట్‌గా నిలిచింది.