Dayaa Webseries Review: వర్సటైల్ యాక్టర్, హీరో జేడీ చక్రవర్తి (JD Chakravarthy) ప్రధాన పాత్రలో దర్శకుడు పవన్ సాధినేని(Pawan Sadhineni) తెరకెక్కించిన వెబ్ సిరీస్ దయ. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ హాట్ స్టార్(Hot Star)లో ఈ రోజు నుంచి స్ట్రీమ్ అవుతుంది. ట్రైలర్‌తో మంచి థ్రిల్లర్‌ను చూడబోతున్నామనే అనుభూతి కలిగించిన ఈ సిరీస్ ఎంత వరకు ఆకట్టుకుందో చూద్దాం.
కథ:
దయ (జేడీ చక్రవర్తి) కాకినాడ పోర్టులో ఫ్రీజర్ వ్యాన్ డ్రైవర్‌గా పని చేస్తుంటాడు. అతని భార్య ఈషా రెబ్బా (Isha Rebba) నిండు గర్భిణి. సాధారణ జీవితం గడిపే డ్రైవర్ దయ జీవితంలో అనుకోని ఓ ఘటనతో జీవితం తలకిందులు అవుతుంది. చేపలు రవాణా చేసే ఫ్రీజర్ వ్యాన్‌లో ఒక లేడీ డెడ్ బాడీ కనిపిస్తుంది. ఆ శవం వ్యాన్‌లోకి ఎలా వచ్చిందో అతనికి తెలియదు. దాన్ని చూసి షాక్ అయిన అతడు దాని నుంచి తప్పించుకోవడానికి ఎలా ప్రయత్నం చేస్తాడు.? వ్యాన్ లోకి శవం ఎలా వచ్చింది.? ఆ శవం ఎవరిది? ఈ సమస్య నుంచి దయ ఎలా బయటపడ్డాడు? జర్నలిస్ట్ కవిత (రమ్యా నంబీసన్) హైదరాబాద్ నుంచి కాకినాడ పోర్టుకు ఎందుకు వచ్చారు? ఈ కథలో షబానా (విష్ణుప్రియ) పాత్ర ఏమిటి? వీటికి సమాధానాలు తెలియాలంటే (Dayaa Webseries Review)వెబ్‌సిరీస్ చూడాల్సిందే.
ఎలా ఉంది:
దయ బెంగాలీ సిరీస్ తక్దీర్ను దర్శకుడు పవన్ సాధినేని తెలుగులో రీమేక్ చేశారు. ఇక సిరీస్‌లో ప్రతి ఎపిసోడ్ గ్రిప్పింగ్‌గా సాగుతుంది. ఒక పర్ఫెక్ట్ థ్రిల్లర్ కి అవసరమైన సాలిడ్ స్క్రీన్ ప్లేతో దర్శకుడు మెప్పించాడు. థ్రిల్లర్స్ ప్రెజెంట్ చేయడంలో పవన్ సాధినేని మాస్టర్ టెల్లర్. దయ వ్యాన్‌లో లేడీ శవం కనిపించగా… హైదరాబాద్‌లో కమల్ కామరాజు తన భార్య అయిన జర్నలిస్ట్ కవిత మిస్ అయినట్లు కంప్లైంట్ ఇస్తాడు. ఈ రెండు సంఘటనలకు సంబంధం ఉందా అనేది ఆసక్తికర పరిణామం. (Dayaa Webseries Review) కథనం ఆసక్తిరేపుతూ సాగుతుంది. నెక్స్ట్ ఏం జరుగుతుందో అంచనా వేయడం కష్టం. ప్రతి ఎపిసోడ్ ఎండింగ్ నెక్స్ట్ ఎపిసోడ్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. ఇక దయాలో సస్పెన్స్, డ్రామా, క్రైమ్ అంశాలు పర్ఫెక్ట్ గా కుదిరాయి. పొలిటీషియన్ స్వార్థానికి సామాన్యులు ఎలా బలి అవుతున్నారనే అంశాలను ప్రస్తావించారు.
ఎవరెలా చేశారు:
జేడీ చక్రవర్తి సహజ నటుడు. మరో సారి తన నటనతో మెప్పించారు. క్యారెక్టర్లో ఒదిగిపోయారు. ఇక సిరీస్‌లో తన నటనతో సిరీస్‌లో చాలా సన్నివేశాలను మరో మెట్టు ఎక్కించారు. ఫ్రీజర్ వ్యాన్ దగ్గర ఫైట్ సీన్ అద్భుతంగా ఉంటుంది. సిరీస్‌లో జేడీ ట్రాన్స్ఫర్మేషన్ ప్రేక్షకులకు షాక్ ఇస్తుంది.(Dayaa Webseries Review) ఈషా రెబ్బా పాత్ర పరిధి పరిమితమే. స్క్రీన్ మీద కనిపించే సన్నివేశాలు కొన్ని మాత్రమే అయినప్పటికీ బాగా చేసింది. జర్నలిస్ట్ పాత్రలో రమ్యా నంబీసన్ చక్కగా నటించారు. కమల్ కామరాజు ఉన్నంతలో మెప్పించాడు. యాంకర్ విష్ణు ప్రియ భీమనేని నటన బాగుంది. జోష్ రవికి చాలా రోజుల తర్వాత పెద్ద క్యారెక్టర్ లభించింది. తన పాత్రకు అతను న్యాయం చేశారు(Dayaa Webseries Review). మిగితా నటీనటులు కూడా అద్బుతంగా నటించారు.