»Jd Chakraborty Clarity On Marriage With Vishnupriya
Vishnupriya:తో పెళ్లిపై జేడీ చక్రవర్తి క్లారిటీ
తాను జేడీ చక్రవర్తిని(JD Chakravarthy) ఇష్టపడుతున్నానని, అవకాశం లభిస్తే ఆయన్నిపెళ్లి(marriage) చేసుకుంటానంటూ యాంకర్ విష్ణుప్రియ ఇటీవల వ్యాఖ్యలు చేసింది. ఆయనకు రెండో భార్యగా ఐనా వెళ్తా అని తన మనసులో మాట చప్పేసింది. ఈ వ్యాఖ్యలపై జేడీ చక్రవర్తి ఓ ఇంటర్వ్యూలో భాగంగా స్పందించారు.
హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి జేడీ చక్రవర్తి(JD Chakravarthy). ఏదైనా బహిరంగంగా మాట్లాడే జేడీ ప్రస్తుతం OTTలో పలు సినిమాలు చేస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. అంతేకాదు తనకు జేడీ చక్రవర్తి అంటే ఇష్టమని, పెళ్లి(marriage) చేసుకుంటానని యాంకర్ విష్ణుప్రియ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. అలా అనడానికి గల కారణాన్ని జేడీ వెల్లడించారు.
జేడీ చక్రవర్తి మా మధ్య మంచి అనుబంధం ఉంది. కానీ అది ప్రేమ కాదు. విష్ణుప్రియ(Vishnupriya) చాలా మంచి అమ్మాయి. మేమిద్దరం ఇటీవల ఓ సిరీస్లో కలిసి నటించాం. ఆ సిరీస్ కోసం దాదాపు 40 రోజులు కలిసి పనిచేశాం. ఆ సిరీస్ దర్శకుడు విష్ణుప్రియకు నేను నటించిన సినిమాని రోజూ చూడమని సలహా ఇచ్చాడని అన్నారు. అలా ఆమె ఆ అభిప్రాయం ఏర్పరచుకుని ఉండవచ్చని వెల్లడించారు. తాను నటించిన సినిమాల్లోని పాత్రలతోనే ఆమె ప్రేమలో పడింది. తప్ప నాతో కాదని స్పష్టం చేశారు. మాది గురు శిష్యుల బంధం మాత్రమేనని వెల్లడించారు. ఇటీవల ఓషోలో పాల్గొన్న విష్ణుప్రియ.. జేడీ చక్రవర్తి ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటానని చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా విష్ణుప్రియ ‘గంగులు’ పాటతో అభిమానులను పలకరించింది. ఈ పాటలో బిగ్ బాస్ ఫేమ్ మనుస్ తో కలిసి డ్యాన్స్ చేసి ఫుల్ ఫేమస్ అయ్యింది.