Anni manchi sakunamule: అన్నీ మంచి శకునములే మూవీ ఫుల్ రివ్యూ
బివి నందిని రెడ్డి దర్శకత్వం వహించిన రొమాంటిక్ డ్రామా చిత్రం 'అన్ని మంచి శకునములే(anni manchi sakunamule)' ఈరోజు(మే 18న) థియేటర్లలో విడుదలైంది. ఇందులో సంతోష్ శోభన్, మాళవిక నాయర్, రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్, నరేష్, గౌతమి తదితరులు ముఖ్య పాత్రల్లో యాక్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ మూవీ రివ్యూ ఎలా ఉందో ఇక్కడ చుద్దాం.
సినిమా – అన్నీ మంచి శకునములే నటీనటులు – సంతోష్ శోభన్, మాళవిక నాయర్, రాజేంద్రప్రసాద్, రావు రమేష్, నరేష్, గౌతమి, సౌకార్ జానకి, వెన్నెల కిషోర్, ఊర్వశి, తదితరులు దర్శకురాలు – బి. వి. నందిని రెడ్డి నిర్మాత – ప్రియాంక దత్, స్వప్నా దత్ సంగీతం – మిక్కీ జె. మేయర్ సినిమాటోగ్రాఫర్ – సన్నీ కూరపాటి, రిచర్డ్ ప్రసాద్ డైలాగ్స్ – లక్ష్మీ భూపాల రన్ టైమ్- 2 గంటలు 0 నిమిషాలు విడుదల తేదీ – 18 మే 2023
టాలీవుడ్(Tollywood) హీరో సంతోష్ శోభన్(Santhosh Shobhan) ‘అన్నీ మంచి శకునములే’ సినిమా(Anni Manchi Shakunamule)తో ఈరోజు(మే 18న) ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ‘గోల్కొండ హై స్కూల్’తో బాలనటుడిగా సంతోష్ శోభన్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ‘తాను నేను’ సినిమాతో హీరోగా మారాడు. ఆ తర్వాత ‘పేపర్ బాయ్’ సినిమా(Paperboy Movie)తో వచ్చి పర్వాలేదనిపించాడు. ‘ఏక్ మినీ కథ’ సినిమాతో ప్రేక్షకుల మెప్పు పొందాడు. కానీ తర్వాత వచ్చిన మాంచి రోజులొచ్చాయ్, లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్, కళ్యాణం కమనీయం, శ్రీదేవి శోభన్ బాబు వంటి చిత్రాలు పెద్దగా ఆకట్టుకోలేదు. ఈ నేపథ్యంలో తాజాగా వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చుద్దాం.
కథ
ఈ చిత్రంలో రెండు కుటుంబాలు ప్రసాద్ (రాజేంద్రప్రసాద్), సుధాకర్ (నరేష్)ల మధ్య విభేదాలు ఉంటాయి. ఇది వారి ముత్తాతల నుంచి వారసత్వంగా వచ్చిన కాఫీ ఎస్టేట్‌కు సంబంధించిన వివాదం. వీరి పిల్లలు రిషి (సంతోష్ శోభన్), ఆర్య (malavika nair) మంచి స్నేహితులు. అయితే రిషి అనేక సందర్భాల్లో తనకు తానే డిస్సాపాయింట్ అవుతుంటాడు. అదే క్రమంలో ఆర్యను లవ్ చేస్తాడు. కానీ చెప్పడు. వీరిద్దరి పూర్వీకుల కుటుంబాల భాగస్వామ్య ఆస్తులపై వివాదంలో ఈ రెండు ఫ్యామిలీల మధ్య గొడవలు ఉంటాయి. ఆర్య, రిషి పెరిగే కొద్దీ, కుటుంబాల మధ్య వివాదం పెరుగుతుంది. అదే క్రమంలో రిషి స్టడీస్ కోసం ఫారెన్ వెళతాడు. ఒకనొక సమయంలో రిషి తన ప్రేమను ఆర్యకు వ్యక్తపరుస్తాడు. కానీ ఆర్య అందుకు నో చెబుతుంది. ఆ నేపథ్యంలోనే ఆర్యకు మరో వ్యక్తితో మ్యారేజ్ ఫిక్స్ అవుతుంది. ఆ క్రమంలో రిషి ఏం చేశాడు? తన ప్రేమను ఎలా దక్కించుకున్నాడు? రెండు కుటుంబాల మధ్య గొడవలు ఎలా సద్దుమణిగాయి ? చివరికి ఆర్య తన అభిప్రాయం మార్చుకుందా అనేది తెలియాలంటే పూర్తి సినిమా చూడాల్సిందే.
ఎవరెలా చేశారు
ఈ మూవీలో హీరో సంతోష్ శోభన్ తన కొత్త కోణాన్ని చూపించాడు. అతని గత చిత్రాలతో పోల్చినప్పుడు అతని నటన చాలా మెరుగుపడింది. సెకండాఫ్ సీన్లలో మెరుగ్గా కనిపించాడు. దీంతోపాటు ఎమోషనల్ సీన్లకు కూడా పూర్తి న్యాయం చేశాడని చెప్పవచ్చు. మరోవైపు మాళవిక నాయర్ కూడా తన పాత్రలో బాగుంది. ఈమె పట్టణ మహిళగా స్టైలిష్ గా కనిపిస్తుంది. దీంతోపాటు డైలాగ్స్ తీరు, యాక్టింగ్ కూడా పర్వాలేదు. మరోవైపు ఈ చిత్రంలో మాళవికకు మంచి స్క్రీన్ ప్రెజెన్స్ లభించింది. ఇందులో సహాయక తారాగణం రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్, నరేష్, గౌతమి, అనేక మంది అనుభవజ్ఞులైన నటులు ఉన్నారు. వారి క్యారెక్టర్ల పరిధిమేరకు నటించారు.
సాంకేతికం
దర్శకురాలు నందిని రెడ్డి తన ఫీల్ గుడ్ సినిమాలకు ప్రసిద్ధి చెందింది. ఆమె AMS ద్వారా కూడా అలాంటి అనుభవాన్ని అందించడానికి ప్రయత్నించింది. కానీ స్క్రీన్‌ప్లే, స్టోరీ చాలా నెమ్మదిగా అనిపిస్తుంది. ఆమె ఎగ్జిక్యూషన్ కూడా సరిగా చేసినట్లు అనిపించదు. కొన్ని ఎమోషనల్ సీన్స్, కామెడీ సన్నివేశాలు మినహా మిగిలిన సినిమా అంతా చాలా బోరింగ్ గా అనిపించి ప్రేక్షకుడికి ఆసక్తిని కోల్పోయేలా చేస్తుంది. మిక్కీ జె మేయర్ అందించిన నేపథ్య సంగీతం మినహా పాటలు కూడా అంతగా ఆకట్టుకోలేదు. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇది ప్రతి సన్నివేశంలో ప్రతిబింబిస్తుంది. ఎడిటింగ్ పర్వాలేదు. సన్నీ కూరపాటి, రిచర్డ్ ప్రసాద్ విజువల్స్‌తో బాగా పనిచేశారు.
ప్లస్ పాయింట్స్
నటీనటుల యాక్టింగ్
ప్రొడక్షన్ వాల్యూస్
కొన్ని కామెడీ, ఎమోషనల్ సీన్స్
మైనస్ పాయింట్స్
ఊహించదగిన స్టోరీ
బోరింగ్ ఫస్ట్ హాఫ్
స్లో నేరేషన్
సాంగ్స్