AP Government: ఏపీ టీచర్లకు షాక్..సెలవుల్లోనూ పనులు
ఏపీలో వేసవి సెలవు(Summer Holidays)ల్లో ప్రతి పాఠశాలలో కూడా ప్రభుత్వ ఉపాధ్యాయులు 23 రకాల కార్యకలాపాలు నిర్వర్తించాల్సి ఉంటుందని విద్యాశాఖ ఆదేశాలిచ్చింది.
ఏపీ సర్కార్(AP Government) ఉపాధ్యాయుల(Teachers)కు షాకిస్తూ కీలక నిర్ణయం(Shocking decision) తీసుకుంది. ప్రభుత్వ టీచర్లకు వేసవి సెలవు(Summer Holidays)ల్లో పనులను అప్పగించనుంది. దీనికి సంబంధించిన ఇప్పటికే విద్యాశాఖ ఆదేశాలిచ్చింది. మే 1 నుంచి వేసవి సెలవులు ఉన్నా కూడా ఉపాధ్యాయులు మాత్రం పాఠశాలలకు రావాల్సి ఉంటుంది. 3, 4, 5వ తరగతి విద్యార్థులకు వర్క్ షీట్లను అందించాల్సి ఉంటుంది.
అలాగే ‘మేము చదవడాన్ని ఇష్టపడతాం’ అనే కార్యక్రమానికి, జగనన్న విద్యా కానుక కిట్ల(Vidya kanuka kits) సరఫరా పనులకు, అలాగే పదో తరగతి ఫలితాల తర్వాత టీసీలు జారీ చేసే పనులను, నాడు-నేడు పనులు, విద్యార్థులు గ్రంథాలయాలకు వెళ్లేలా చూసే పని, ఎంట్రన్స్ పరీక్షలకు ప్రిపేరయ్యే వారికి శిక్షణ ఇవ్వడం లాంటివి ఏపీలోని ఉపాధ్యాయులు(Teachers) చేయాల్సి ఉంటుంది.
ఏపీలో వేసవి సెలవు(Summer Holidays)ల్లో ప్రతి పాఠశాలలో కూడా 23 రకాల కార్యకలాపాలు నిర్వర్తించాల్సి ఉంటుందని విద్యాశాఖ ఆదేశాలిచ్చింది. మేము చదవడాన్ని ఇష్టపడతాం అనే కార్యక్రమాన్ని మే 1వ తేది నుంచి జూన్ 10వ తేది వరకూ నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. విద్యార్థులను బృందాలుగా విభజించి వారిని టీచర్లు దత్తత తీసుకోవాలని, వారితో పుస్తకాలు చదివేలా చూడాలని తెలిపింది. ఒక వేళ పాఠశాలలోని ప్రధానోపాధ్యాయులు సెలవు పెడితే ఆ రోజుల్లో మరో టీచర్ కు ఆ పనులు అప్పజెప్పాలని వెల్లడించింది. ఇటువంటి కార్యక్రమాలు నిర్వర్తించాలంటే కచ్చితంగా టీచర్లు పాఠశాలలకు వెళ్లాల్సి ఉంటుంది. ప్రభుత్వ నిర్ణయం(Shocking decision)తో టీచర్లు కూడా ఏం మాట్లాడలేక మౌనంగా ఉంటున్నారు.