జబర్దస్త్ నటుడు పంచ్ ప్రసాద్(punch prasad) అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ మేరకు తోటి నటుడు ఇమ్మాన్యుయేల్ సోషల్ మీడియా ఇన్ స్టా (instagram) వేదికగా వెల్లడించారు. ప్రసాద్ అన్న కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారని తెలిపారు. అన్నకి సీరియస్ గా ఉందని…ఆపరేషన్ చెయ్యాలని డాక్టర్లు అన్నారని పేర్కొన్నాడు. అందుకోసం చాలా ఖర్చు అవుతుందని..తాము ట్రై చేస్తున్నామని వెల్లడించారు. ఈ నేపథ్యంలో పలువురు సాయం చేయాలని సోషల్ మీడియా వేదికగా కోరారు.
పంచ్ ప్రసాద్ (punch prasad) ఇదివరకు అనారోగ్యం బారిన పడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. గత ఏడాది నవంబర్‌లో ఓ సారి సీరియస్ అయ్యింది. కిడ్నీ సమస్య తిరగబెట్టడంతో నడవలేని స్థితికి చేరుకున్నాడు. షూటింగ్ నుంచి ఇంటికి వెళ్లిన ప్రసాద్ జ్వరం వచ్చింది. నడవలేకపోవడంతో ఫ్యామిలీ మెంబర్స్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. పరీక్షలు చేసి కిడ్నీ సమస్య తీవ్రమైందని వైద్యులు వివరించారు. నడుము వెనక వైపు చీము పట్టిందని వెల్లడించారు. ఓ ఆపరేషన్ చేశారు. ఆ తర్వాత కోలుకున్నారు. షూటింగులకు కూడా వచ్చాడు. ఇటీవల టీవీ ప్రోగ్రామ్స్‌లో కనిపించాడు. ఇప్పుడు మళ్లీ ఆరోగ్య సమస్య తిరగబెట్టింది.