»Jabardasth Actor Nava Sandeep Case File On Golconda Police Station
jabardasth actor: యువతికి మోసం..జబర్దస్త్ కమెడియన్ పై కేసు
జబర్దస్త్ కమెడియన్(jabardasth actor ), గాయకుడు నవ సందీప్(nava sandeep)పై కేసు నమోదైంది. ఓ యువతిని పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని ఆమె గోల్కొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
jabardasth actor nava sandeep case file on golconda police station
బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ కి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రారంభమైనప్పటి నుంచి ఈ షో తెలుగు ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ షో ద్వారా పాపులర్ అయిన వారు చాలా మంది ఉన్నారు. జబర్దస్త్‌తో వచ్చిన క్రేజ్‌తో పలు షోలు, సినిమాల్లో అవకాశాలను అందుకుంటూ సినీ పరిశ్రమలో కెరీర్‌ను పదిలం చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఇదే కార్యక్రమంలో యాక్ట్ చేసిన ఒక హాస్యనటుడు నవ సందీప్(nava sandeep) ఓ యువతిని మోసం చేసినట్లుగా వెలుగులోకి వచ్చింది.
అయితే ఈ నటుడు అమీర్ పేటకు చెందిన యువతి(28)తో పరిచయం పెంచుకుని వాట్సాప్ చాటింగ్(chatting) చేశాడు. ఆ క్రమంలో వీరి పరిచయం కాస్తా ప్రేమ వరకు దారి తీసింది. ఈ నేపథ్యంలోనే యువతి పెళ్లి ప్రస్తావన తీసుకురాగా..అతను ఆమెను దూరంగా పెట్టడం మొదలుపెట్టాడు. దీంతో మోసాపోయానని తెలుసుకున్న యువతి తనకు న్యాయం చేయాలని గోల్కొండ పోలీస్ స్టేషన్లో అతనిపై కేసు నమోదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే గాయకుడు, కమెడియన్ అయిన నవ సందీప్ గోల్కొండ ప్రాంతంలో నివసిస్తున్నట్లు తెలిసింది. అంతేకాదు తనపాటులతోపాటు కామెడీతోకూడా తనదైన స్థాయిలో సందీప్ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు యువతిని మోసం చేయడం పట్ల నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అంతేకాదు గంతలో జబర్దస్త్ కామెడీ షోలో హాస్య నటుడిగా పనిచేసిన జబర్దస్త్ హరిపై కూడా ఓ కేసు(case) నమోదైంది. హరిబాబు ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో పట్టుబడ్డాడు. చిత్తూరు జిల్లా పుంగనూరు రూ.60 లక్షల విలువైన ఎర్రచందనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ తరలింపులో హరిబాబు హస్తం ఉందని పోలీసులు తెలిపారు. జూన్ 11వ తేదీ ఆదివారం రాత్రి పుంగనూరు పోలీసులకు సమాచారం అందించడంతో నగర శివారులో తనిఖీలు చేపట్టారు. పోలీసులను చూసి రెండు వాహనాలు పారిపోయేందుకు ప్రయత్నించగా, వాటిని అడ్డగించి పట్టుకున్నారు.