పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో మణిపూర్లో మహిళలపై సామూహిక అత్యాచారం ఘటనను ప్రధాని మోడీ(modi) ఖండించారు. సభ్య సమాజానికి ఇది అవమానకరమని వ్యాఖ్యానించారు. ఇలాంటి సందర్భాలలో ఆయా రాష్ట్రాలు రాష్ట్రాలకతీతంగా పనిచేయాలని ప్రధాని సీఎంలను కోరారు.
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. ఇవి ఆగస్టు 11 వరకు కొనసాగనున్నాయి. ఈ నేపథ్యంలో మణిపూర్ హింస(Manipur incident)కు సంబంధించి బుధవారం తలెత్తిన వివాదంపై ప్రధాని మోడీ(Prime Minister modi) ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన సభ్య సమాజానికే అవమానకరమని పేర్కొన్నారు. తన హృదయం బాధతో, కోపంతో నిండిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. నేరస్తులను విడిచిపెట్టబోమని హామీ ఇస్తున్నట్లు వెల్లడించారు. మణిపూర్ కుమార్తెల విషయంలో జరిగిన దానిని ఎప్పటికీ క్షమించలేమని అన్నారు. మే 4న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
అయితే రెండు నెలలుగా చెలరేగుతున్న మణిపూర్ హింసాకాండపై ప్రధాని నరేంద్ర మోదీ గురువారం మొదటిసారిగా మాట్లాడారు. మహిళల రక్షణ కోసం రాజకీయాలకు అతీతంగా రాష్ట్రాలు పనిచేయాలని ప్రధాని మోడీ కోరారు. రాజస్థాన్, మణిపూర్ లేదా ఛత్తీస్గఢ్ అయినా మన మహిళలందరికీ రక్షణ కల్పించాలని అందరు సీఎంల(CMs)కు విజ్ఞప్తి చేస్తున్నట్లు వెల్లడించారు. మహిళలను రక్షించడానికి రాజకీయాలకు అతీతంగా ఉండాలని సూచించారు. ఈ వీడియోకు సంబంధించి మణిపూర్ సీఎం ఎన్ బీరెన్ సింగ్తో కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే ఈ ఘటన గురించి మాట్లాడారు. దీనిపై చర్యలు తీసుకోవాలని భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ సైతం ప్రభుత్వాన్ని కోరారు.
#WATCH | Prime Minister Narendra Modi says, "…I assure the nation, no guilty will be spared. Law will take its course with all its might. What happened with the daughters of Manipur can never be forgiven." pic.twitter.com/HhVf220iKV