గుజరాత్(gujarat) అహ్మదాబాద్(ahmedabad)లోని ఇస్కాన్ వంతెనపై ఘోర ప్రమాదం జరిగింది. కారు జనంపైకి దూసుకెళ్లడంతో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా, మరో 15 మంది మంది గాయపడ్డారు. రాజ్‌పథ్ క్లబ్ నుంచి వేగంగా వస్తున్న కారు రద్దీగా ఉండే సర్ఖేజ్-గాంధీనగర్ పై ఉన్న జనాలపైకి దూసుకెళ్లడంతో ఈ యాక్సిడెంట్ చోటుచేసుకుంది. ఈ ఘోర ప్రమాదం నిన్న అర్థరాత్రి జరిగింది. విషయం తెలిసిన రెస్క్యూ టీమ్, స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మరోవైపు ప్రమాద సమయంలో డ్యూటీలో ఉన్న ఓ పోలీసు కానిస్టేబుల్, హోంగార్డు సిబ్బంది మృతి చెందడం విచారకరం.